Missouri Home Explossion: అమెరికాలో షాకింగ్ ఘటన.. అగ్నికి ఆహుతిగా మారిన పసిపిల్లలు.. అసలేం జరిగిందంటే..?
Ameica winter effect: చలిగాలులు ఎక్కువగా ఉండటంతో మిస్సోరీ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. ఈ క్రమంలోనే డిఫైయన్స్ నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Fire Tragedy: అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో దిగ్భ్రాంతికర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. కొన్నిరోజులుగా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో మిస్సోరీలోని అనేక చోట్ల పాఠశాలల స్యూల్ లకు సెలవులు ప్రకటించాయి. ఈ క్రమంలోనే మిస్సోరీలోని డిఫైయన్స్ నగరంలో జరిగిన సంఘటనలో ఇద్దరు పసిపిల్లలు ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారంనాడు మిస్సోరీలోని స్కూల్ లకు సెలవులు ప్రకటించారు. అయితే.. నాలుగేళ్ల కీజర్, అతని ఆరేళ్ల సోదరుడు జామిసన్ ఇంట్లోనే ఉండిపోయారు. వీరు తమ తల్లి ఎవెలిన్ టర్పియానో, తాతలు.. జెన్నిఫర్ హామ్, వెర్న్ హామ్ లతో ఇంట్లో సరదాగా గడిపారు.
పిల్లలిద్దరు ఇంట్లో ప్రత్యేకంగా ఉన్న గదిలో ఉండగా.. ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించింది. దీంతో పిల్లల కుటుంబ సభ్యులకు కాసేపు ఏంజరుగుతుందో తెలియక షాకింగ్ లో ఉండిపోయారు. కళ్లముందే ఇల్లంతా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే కీజర్, జామిసన్ లిద్దరు కూడా అగ్నికి ఆహుతిగా మారిపోయారు. కళ్ల ముందే కొడుకులిద్దరు చనిపోవడంతో ఆమె కాసేపు షాకింగ్ లో ఉండిపోయింది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పెద్ద సంఖ్యలో పేలుడు ప్రదేశానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. అయితే.. పిల్లలిద్దరు మాత్రం అగ్ని ప్రమాదంలో మరణించారు. పేలుడు ఘటనతో అక్కడి స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.
బాధిత కుటుంబంలోని పిల్లలు తమతో ఎంతో సరదాగా ఉంటూ, ఆడుకునేవారని స్థానికులు అంటున్నారు. అంతే కాకుండా.. పిల్లలిద్దరిని ప్రేమతో స్వీట్ లిటిల్ బాయ్స్ అని పిలిచేవారంట. ఇదిలా ఉండగా.. మిగతా కుటుంబసభ్యులు కాస్తంతా దూరంగా ఉండటంతో పేలుడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇంట్లో పేలుడు సంభవించడంపై గల కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Ayodhya: భవ్యరామమందిరం ప్రారంభోత్సవం.. ముస్లిం ఫ్యామిలీ తమ బాలుడికి ఏంపేరు పెట్టారో తెలుసా..?
Read Also: Ramlala Pratishtapana Updates: అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ వేడుకలు.. నేటి నుంచే రామరాజ్యం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook