అమెరికా భద్రతా బలగాలు బాగ్దాద్ విమానాశ్రయంపై దాడి చేసి ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని హతమార్చాయి. సులేమానీని హత్య చేయడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా అగ్రరాజ్యం అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పైగా  బాగ్దాద్‌లోని బలాడ్‌ అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్  రాకెట్‌ దాడి చేసింది. అంతే కాకుండా అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా ఆస్తులపై దాడులు జరుగుతున్న సమయంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దేశ పౌరులపై గానీ .. అమెరికా ఆస్తులపై గానీ దాడులకు దిగితే అగ్రరాజ్యం ఊరుకోబోదని హెచ్చరించారు. దాడులు జరిగిన మరు క్షణమే తీవ్రంగా రియాక్షన్ వస్తుందంటూ హెచ్చరించారు. అమెరికా టార్గెట్ లో ఇరాన్ లోని 52 ప్రాంతాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ వ్యవస్థ..ప్రపంచంలో అన్ని దేశాల కంటే బెస్ట్ గా ఉందంటూ ట్వీట్ చేశారు.