Joe Biden on Zelenskyy: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా సైనిక చర్య..యుద్ధంపై బైడెన్ ఏమన్నారంటే..!
Joe Biden on Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. యుద్ధంతో ఇరుదేశాల్లో భారీగా ప్రాణ,ఆస్తి నష్టం సంభవించింది. గత నాలుగు నెలలుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది.
Joe Biden on Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతోంది. యుద్ధంతో ఇరుదేశాల్లో భారీగా ప్రాణ,ఆస్తి నష్టం సంభవించింది. గత నాలుగు నెలలుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు, పట్టణాలు నేల మట్టమయ్యాయి. ఇటు రష్యా సైతం తీవ్రంగా నష్టపోయింది. రష్యా సైనికులు భారీ సంఖ్యలోనే ప్రాణాలను కోల్పోయారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది.
ఈక్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాస్ ఏంజెల్స్‌లో నిధుల సమీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యుద్ధం ముందు పరిస్థితులను వివరించారు. రష్యా సైనిక దాడిపై తాము ముందే హెచ్చరించామన్నారు జో బైడెన్. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి చెప్పినా వినిపించుకోలేదన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సరిహద్దులోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న విషయాన్ని ముందే చెప్పినట్లు తెలిపారు.
ఐతే విషయాన్ని వినేందుకు జెలెన్‌స్కీ ఇష్టపడలేదన్నారు. ఆయనతోపాటు చాలా మంది కూడా తన వ్యాఖ్యలను పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా తన మాటలను ఎందుకు వినిపించుకోలేదో అర్థమయ్యిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి ఉక్రెయిన్‌పై పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి.
రష్యా సైనిక సన్నద్ధతపై ముందే అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ఎప్పుడు ఆరంభమవుతుందో ముందే చెప్పేసింది. అమెరికా అంచనా వేసినట్లుగానే రష్యా సైన్యం మిలటరీ ఆపరేషన్‌కు దిగింది. అమెరికా హెచ్చరికలను ఐరోపా మిత్ర దేశాలు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి.
Also read: Khaitalapur Bridge: కూకట్‌పల్లి-హైటెక్ సిటీ మధ్య ఇకపై నో ట్రాఫిక్ జాం..అందుబాటులోకి మరో ఫ్లైఓవర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి