India vs South Africa: రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్‌..టీమిండియా తుది జట్టు ఇదే..!

India vs South Africa: టీ20ల్లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. వరుసగా 13 మ్యాచ్‌ల్లో గెలిచి వరల్డ్ రికార్డు సృష్టించాలని భావించిన భారత్..దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో టీ20ల్లో వరుసగా 12 విజయాలు సాధించిన అఫ్ఘానిస్థాన్‌, రొమేనియా జట్లతో సమానంగా నిలిచింది.

Written by - Alla Swamy | Last Updated : Jun 11, 2022, 04:34 PM IST
  • టీ20ల్లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్‌
  • రేపు భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో మ్యాచ్
  • గెలుపుపై కన్నేసిన ఇరు జట్లు
India vs South Africa: రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్‌..టీమిండియా తుది జట్టు ఇదే..!

India vs South Africa: 5 టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని టీమిండియా యోచిస్తోంది. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో ముందంజ వేయాలని సఫారీ జట్టు స్కెచ్‌లు వేస్తోంది.కటక్‌ వేదికగా రెండో మ్యాచ్‌ జరగనుంది. గాయం కారణంగా కేఎల్ రాహుల్‌ జట్టుకు దూరమయ్యాడు. దీంతో రిషబ్ పంత్ సారధిగా నడిపిస్తున్నాడు.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కావడంతో ఈమ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారింది. తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినా..బౌలర్లు సరిగా రాణించకపోవడంతో భారత్ ఓడిపోయింది. బౌలర్లను ఉపయోగించడంలో పంత్ విఫలమయ్యాడన్న విమర్శలు ఉన్నాయి. భువనేశ్వర్, హర్షల్ పటేల్, చాహల్ బౌలింగ్‌లో పసలేకుండా పోయింది. డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చారు. తొలుత అద్భుతంగా బౌలింగ్ వేసినా..చివర్లో చేతులెత్తేశారు. చాహల్‌ సైతం ఆకట్టుకోలేకపోయాడు.

ఈక్రమంలో బౌలింగ్ విభాగంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అవేశ్‌ ఖాన్‌ స్థానంలో అర్ష్‌ దీప్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో అర్ష్‌దీప్‌ అద్భుతంగా రాణించాడు. డెత్‌ ఓవర్లలో అతడికి అద్భుత రికార్డు ఉంది. ఉమ్రాన్ మాలిక్‌ సైతం జట్టులోకి వచ్చే అకాశం ఉంది. బ్యాటింగ్‌ విభాగంలో టీమిండియా పటిష్ఠంగా ఉంది. బ్యాటింగ్‌ విభాగంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు.

కొత్తగా బౌలర్‌ను తీసుకోవాలనుకుంటే..దినేష్‌ కార్తీక్‌ను పక్కకు పెట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఉండనున్నారు. శ్రేయస్ అయ్యర్, పంత్‌ మిడిల్‌  ఆర్డర్ లో రానున్నారు. ఇక చివర్లో పాండ్యా, ఇతర ఆల్‌రౌండర్లు భారత్‌కు ఉన్నారు. బౌలింగ్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తే..విజయం తధ్యమని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఇటు దక్షిణాఫ్రికా అన్ని విభాగాల్లో అద్భుతంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విశేషంగా రాణిస్తోంది. డికాక్, మిల్లర్, డుస్సెన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మొన్నటి మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ ముందు వచ్చిన ప్రిటోరియస్‌ రెచ్చిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో అలరించాడు. ఇరుజట్లు బలంగా ఉండటంతో కటక్‌ మ్యాచ్‌ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. కటక్‌లో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడి..ఒక దాంట్లో ఓడి..మరో మ్యాచ్‌లో గెలిచింది.

టీమిండియా జట్టు:

రిషబ్ పంత్(కెప్టెన్), ఇషాన్ కిషన్, గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేశ్‌ కార్తీక్/ఉమ్రాన్ మాలిక్, అక్షర్‌ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్‌ ఖాన్/ అర్ష్‌ దీప్‌ సింగ్, చాహల్.

Also read: Video: వావ్.. ఈ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా... మీరూ ఓ లుక్కేయండి..

Also read:Kishan Reddy on CM Kcr: కుటుంబం కోసమే జాతీయ పార్టీ..సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News