UNSC India: భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం
UNSC India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదిన మరోసారి తెరపైకొచ్చింది. సాక్షాత్తూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం.
UNSC India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదిన మరోసారి తెరపైకొచ్చింది. సాక్షాత్తూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో(UN Security Council) ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పష్టం చేశారు. శాశ్వత సభ్యత్వం విషయంలో ఇండియాకు అమెరికా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని తెలిపారు. అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ, ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తున్న ఇండియాను న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో చేర్చాలని కోరారు. వైట్‌హౌస్‌లో(White House)సమావేశం అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మండలిలో సంస్కరణలు అమలు చేసినప్పుడు ఇండియా శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తామన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan)మానవ హక్కులు, మహిళలు, పిల్లలు, మైనార్టీల హక్కులని గౌరవిస్తూ ఇచ్చిన మాటకు తాలిబన్లు కట్టుబడి ఉండాలని ఇండియా, అమెరికాలు హితవు పలికాయి. ఆఫ్ఘనిస్తాన్ భూభూగం ఉగ్రవాదులకు నిలయంగా మారకూడదని..మరే దేశంలనూ ఉగ్రసంస్థలు విలయం సృష్టించకూడదని జో బిడెన్(Joe Biden)హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌పై యూఎన్ భద్రతామండలి తీర్మానం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ గడ్డను ఉగ్రవాదులకు ఆశ్రయంగా మార్చకూడదన్నారు. ఆఫ్ఘనిస్తాన్ వీడి వెళ్లాలనుకునే విదేశీయులు, ఆఫ్ఘన్‌లను సురక్షితంగా పంపేందుకు చర్యలు తీసుకోవాలని జో బిడెన్, మోదీ(Narendra Modi) కోరారు. ఉగ్రవాదంపై సంయుక్త పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇండియా-అమెరికా దేశాలు హెచ్చరించాయి. సీమాంతర ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించబోమన్నారు.
Also read: Sneha Dubey at UNGA:ఎవరు ఈ స్నేహా దుబే..? ఇమ్రాన్ ప్రతి అబద్దాన్ని ఎండగట్టిన స్నేహా గురించిన పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook