Sneha Dubey at UNGA:ఎవరు ఈ స్నేహా దుబే..? ఇమ్రాన్ ప్రతి అబద్దాన్ని ఎండగట్టిన స్నేహా గురించిన పూర్తి వివరాలు

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇండియన్ ఫస్ట్ సెక్రటరీ స్నేహా దూబే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రపంచం దేశాల ముందు ఉతికి ఆరేసింది. భారత్ పై విషం చిమ్ముతున్న ఇమ్రాన్ కు భారత్ కోరుకుంటున్న శాంతి, స్నేహ భావం గురించి తెలిపిన తీరుకు యావత్ దేశం ప్రశంశలు జల్లు కురిపిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2021, 03:15 PM IST
  • ఐక్యరాజ సమితిలో పాక్ ప్రధానిని ఎండగట్టిన స్నేహా దుబే
  • ఇమ్రాన్ ఖాన్ ప్రతి అబద్దానికి దీటుగా సమాధానం
  • మొదటి సారి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టిన స్నేహా
  • దేశానికి ప్రాతినిధ్యం వహించటమే ఆమె ఏకైక లక్ష్యం
Sneha Dubey at UNGA:ఎవరు ఈ స్నేహా దుబే..? ఇమ్రాన్ ప్రతి అబద్దాన్ని ఎండగట్టిన స్నేహా గురించిన పూర్తి వివరాలు

United Nations General Assembly: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Pakistan's Prime Minister Imran Khan) మరోసారి భారత్‌పై విరుచుకుపడ్డారు, అయితే దానికి ప్రతిస్పందనగా భారత ఫస్ట్ సెక్రటరీ (Indian First Secretary Sneha Dubey) స్నేహా దూబే అదే రీతిలో జవాబు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76 వ సెషన్‌లో ప్రసంగించినప్పుడు, కాశ్మీర్ సమస్యపై ఇమ్రాన్ భారతదేశాన్ని తప్పుగా చూపించటానికి ప్రయత్నించాడు. దానికి బదులుగా స్నేహ దూబే వారి తప్పులను ఎత్తిచూపటమే కాదు, ఇమ్రాన్ (Pak PM Imran Khan) చెప్పిన ప్రతి అబద్దానికి తగిన రీతిలో సమాధానం చెప్పింది. ఒసామా బిన్ లాడెన్ (Osama Bin Laden) వంటి ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఎలా రక్షణో కలిపిస్తుందో... కాశ్మీర్‌లో అక్రంగా చొరబడి చట్టవిరుద్దమైన చర్యలను కొనసాగిస్తుందో గుర్తి చేసింది. ప్రపంచ దేశాల ముందు పాక్ కుట్రలను, ఉగ్రవాదం, పాక్ ఆక్రమించిన కాశ్మీర్ గురించి గట్టిగా నిలదీసి, ప్రపంచం చూపును ఆకర్షించిన స్నేహా దుబే ఎవరు...?? ఇపుడు ఆమె గురించి తెలుసుకుందాం!

Also Read: Google Incognito: గూగుల్ ఇన్‌కాగ్నిటో బ్రౌజర్ ఎంతవరకూ క్షేమకరం, కొత్త ఆరోపణలు

వేరే ఆలోచనే లేదు 
గోవాలో పెరిగిన స్నేహ ఎప్పుడూ, ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో  (Indian Foreign Service) చేరటం ఆమె ఆశయం. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న స్నేహ   IFS గా మారడం ద్వారా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందటం తన అదృష్టంగా భావిస్తున్నారు. స్నేహ కు ప్లాన్ - B లేదని, ఉన్నది ఒకే ఒక లక్ష్యం అది సివిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించటం .. ఇతర కెరీర్ ఆప్షన్ లతో నా లక్ష్యాన్ని మళ్లించిదలచు కోలేదని ఆమె తెలిపారు.  12 సంవత్సరాల వయస్సులోనే  సివిల్ సర్వీసు పరీక్షలో (Civil Services) ఉత్తీర్ణత సాధించాలని నిర్ణయించుకున్నానని, ట్రావెలింగ్ ద్వారా కొత్త సంప్రదాయాలు తెలుసుకోవటం నుండి దేశానికి ప్రాతినిధ్యం వహించడం వరకు ఆమె కన్న ప్రతి కళని సాకారం చేసుకున్నానని తెలిపింది. 

Also Read: MAA Elections 2021 : మా ఎన్నికల కోసం బండ్ల గణేశ్‌ వినూత్న ప్రచారం

ఒకే లక్ష్యం.. దాని కోసమే నిరంతర ఆరాటం
చదువు గురించి మాట్లాడుతూ, పుణెలోని (Pune) ఫెర్గూసన్ కాలేజీ (Ferguson College) నుండి డిగ్రీ పూర్తయ్యాకా, ఆమె న్యూఢిల్లీలోని  జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం (Jawaharlal University) నుండి భూగోళశాస్త్రంలో మాస్టర్స్(Masters in Geography) చేసింది. అంతర్జాతీయ సమస్యలపై ఉన్న ఆసక్తి కారణంగా, ఆమె  జెఎన్‌యులోనే స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో (School of International Studies in JNU) ఎంఫిల్ చదువును (MPhil studies) పూర్తి చేసింది. స్నేహా దూబే (Sneha Dubey) 2011 సంవత్సరంలో మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ (Civil Services) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె కుటుంబంలో ఎవరు కూడా సివిల్ సర్వీసెస్‌లో లేరు. తండ్రి ఒక మల్టీ-నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు మరియు తల్లి ఉపాధ్యారాలు, సోదరుడు వ్యాపారవేత్త. స్నేహకు ఉన్న ఒకే ఒకే ఒక లక్ష్యం... ఆ లక్ష్యం కోసం నిరంతరం ఆరాట పడటం, వాటితో పాటుగా ఇతర చదువులను కొనసాగించటం చేసింది. ఎంత సమయం లక్ష్య ఛేదన కోసం కేటాయిస్తామో.. తగిన సమయం పాటు విశ్రాంతి ఉండాలని ఆమె చెప్పింది. 

Also Read: Modi : ప్రపంచ శాంతి కోసం క్వాడ్‌ కూటమి కృషి ‌‌- ప్రధాని మోదీ

పాకిస్థాన్ ను ఎండగట్టిన స్నేహా... 
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో (United Nations General Assembly) భారతదేశానికి ప్రాతినిధ్యం వచించిన స్నేహా (Indian First Secretary Sneha Dubey) ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ (Pakistan) అబద్దాలను ఎండగట్టిన తీరు ప్రశంసనీయం. "పాకిస్థాన్ ఉగ్రవాదులకు (Terrotism) తమ దేశంలో అనుమతించబడటమే కాకుండా, ఆర్థిక సహాయం మరియు ఆయుధాలు కూడా సరఫరా చేస్తుందన్న విషయం ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. ఇతర దేశాలను తప్పుబట్టే ముందు మీ దేశంలో మైనారిటీల ప్రజల జీవితం ఎలా కష్టంగా మారిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఒక భారత దేశంలోనే కాదు, అమెరికా(America), బంగ్లాదేశ్లలో (Bangladesh) జరిగిన ఘోర ప్రమాదాలలో పాకిస్థాన్ పాత్ర కూడా ఉందన్నారు.  ఐక్యరాజ్యసమితిలో నిర్మొహమాటంగా మాట్లాడిన స్నేహా.. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ (Kashmir) మరియు లడఖ్ (Ladakh) భారతదేశంలో అంతర్భాగంగానే ఉన్నాయి. అయిన పాకిస్థాన్ దురాక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలలో ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. పాకిస్థాన్  అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలను వెంటనే ఖాళీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని" స్నేహా తెలిపారు.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

More Stories

Trending News