American Green Card Rules Changed : అమెరికాలో స్థిరపడాలని లేదా ఆ దేశం గ్రీన్‌కార్డు పొందాలనేది ప్రతి భారతీయుడికి ఉండే కల. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం ఉండాలనుకుంటారు అంతా. నిన్న మొన్నటి వరకూ ఇదంత ఆషామాషీ కాదు. ఇక నుంచి మాత్రం ఇది సులభం..జో బిడెన్ ప్రభుత్వం తాజా నిర్ణయాలు లక్షలాది భారతీయల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలోని జో బిడెన్ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం అక్కడ నివసిస్తున్న వేలాది భారతీయులకు శుభవార్త కానుంది. అమెరికా ప్రభుత్వం కొత్తగా గ్రీన్‌కార్డు నిబంధనలను మార్చింది. విదేశీయులకు అమెరికాలో పర్మినెంట్ అడ్రస్ కోసం జారీ చేసే అర్హతా నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. జో బిడెన్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న లక్షలాదిమందికి ముఖ్యంగా భారతీయులకు లబ్ది చేకూర్చనుంది.


ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని చాలామంది కోరుకుంటుంటారు. అలాంటి వ్యక్తులకు అమెరికా ప్రభుత్వం పర్మనెంట్ రెసిడెంట్ కార్డు జారీ చేస్తుంది. అమెరికా ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ఏడాది 1,40 వేల గ్రీన్‌కార్డులు జారీ అవుతుంటాయి. ఒక్కో దేశానికి పరిమితమైన సంఖ్య ఉంటుంది. అంటే గ్రీన్‌కార్డు కోసం చేరే మొత్తం దరఖాస్తుల్లో ఒక్కొక్క దేశానికి 7 శాతం మించి కేటాయించకూడదు.


Also Read: Bandi Sanjay: పీఆర్‌సీకి ఏర్పాటుకు బండి సంజయ్ రిక్వెస్ట్.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ


ఇప్పుడు నిబంధనలు మార్చడంతో కొత్తగా గ్రీన్‌కార్డు కోసం దాఖలు చేసుకున్నవారికి కూడా గ్రీన్‌కార్డు లభించవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం ఈఏడీ నిబంధన తొలగించారు. గతంలో అయితే ఈఏడీ అర్హత ఉంటేనే గ్రీన్‌కార్డు జారీ అయ్యేది. మరోవైపు వీసా నిబంధనల్లో కూడా మార్పు చేసింది వీలైనన్ని ఎక్కువ వీసాలు ఇచ్చేందుకు ఇండియాలోని అమెరికన్ రాయబార కార్యాలయాలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా విదేశాంగ వ్యవహారాల శాఖ వెల్లడించింది. 


మరోవైపు జూన్ 21 నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడమే కాకుండా అక్కడి చట్టసభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, ద్వైపాక్షిక రంగాలకు ఈ పర్యటన దోహదపడనుంది. అమెరికా వైట్ హోస్‌లో బిడెన్ దంపతుల విందును ప్రధాని మోదీ స్వీకరించనున్నారు. 


Also Read: Boat Capsizes: ఘోర పడవ ప్రమాదం.. 103 మంది మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook