అమెరికా కవయిత్రి లూయిస్ గ్లూక్(77) సాహిత్యంలో చేసిన  కృషికి తగిన ఫలితం దక్కింది. 2020 ఏడాదికిగానూ సాహిత్యంలో నోబెల్ విజేతగా లూయిస్ గ్లూక్ (Louise Gluck wins Nobel Prize for Literature) పేరును ప్రకటించారు. స్టాక్‌హోమ్‌లోని నోబెల్ అవార్డు కమిటీ గురువారం ఈ అవార్డును ప్రకటించింది. కుటుంబ రచయిత్రిగా పేరుగాంచిన లూయిస్ గ్లూక్ (Louise Gluck).. ‘కుటుంబం, బాల్యం అనే అంశాలను మనసుకు హత్తుకునేలా, ఆమె కవితా స్వరం మనిషి ఉనికిని చాటిచెప్పేలా ఉంటుందని’ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకూ ఎన్నో సాహిత్య పురస్కారాలు పొందిన తనకు నోబెల్ విజేత అయ్యాననే విషయం తెలియగానే ఆశ్యర్యంతో పాటు సంతోషం కలిగిందన్నారు. గ్లూక్‌కు 10 మిలియన్ క్రోనార్లు (భారత కరెన్సీలో రూ.8.25 కోట్లు)తో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతలలో నవలా రచయితలే అధికం. అయితే సాహిత్యంలో ఇప్పటివరకూ 16 మంది మహిళలకు ఈ అత్యున్నత గౌరవం దక్కింది. 



 


 



1968లో ‘ఫస్ట్‌బోర్న్’ అనే కవితతో కెరీర్ ప్రారంభించిన లూసీ గ్లూక్ అనతికాలంలోనే అమెరికా సాహిత్యంలో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆరు దశాబ్దాల తన కెరీర్‌లో ది ట్రంయఫ్ ఆఫ్ అచిల్స్, డిసెండింగ్ ఫిగర్స్, అరారట్ వంటి కవితా సంకలనాలను ఈ అమెరికా కవయిత్రి రచించారు.



లూయిస్ గ్లూక్ అందుకున్న పురస్కారాలు


అమెరికన్ అకాడమీ ఆఫ్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్, పులిట్జర్ ప్రైజ్ (1993), యూఎస్ పోయెట్ లారియేట్ (2003, 2004), ‘ఫెయిత్‌ఫెల్ అండ్ వర్చువస్ నైట్‌’ కవితకుగానూ నేషనల్ బుక్ అవార్డు (2014), నేషనల్ హ్యుమానిటీ మెడల్ అవార్డు (2015) లాంటి ఎన్నో ప్రసిద్ధ పురస్కారాలు లూయిస్ గ్లూక్ అందుకున్నారు తాజాగా సాహిత్యంలో నోబెల్‌ విజేతగా అవతరించారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe