CM Jagan Tour: నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్‌ దావోస్ పర్యటన కొనసాగుతోంది. పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ బృందం భేటీ అవుతోంది. రాష్ట్ర పరిస్థితులను వారికి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను ఆవిష్కరించారు సీఎం జగన్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్‌ భేటీలో సీఎం జగన్ పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాప్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు ఉన్న పరిస్థితులు,అవకాశాలను వివరించారు. పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండోలో అనుమతులు ఇస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. సదస్సులో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, గుడివాడ అమర్‌నాథ్‌,ఇతర అధికారులు ఉన్నారు. 


డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేతోనూ సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌తో ఫ్లాట్ ఫాం పార్టనర్‌ షిప్‌పై ఒప్పందం కుదిరింది. సీఎం జగన్ సమక్షంలో సంతకాలు జరిగాయి.  బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్‌ పాల్ బక్నర్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీఎం జగన్‌ను మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్యఠాక్రే మర్యాద పూర్వకంగా కలిశారు. పెట్టుబడుల ఆహ్వానంపై చర్చించినట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్ గౌతం అదానీ సైతం సీఎం జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.


Also read:SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులరా..బీ అలర్ట్..హెచ్చరికలు జారీ..!


Also read:Exercise Video: వ్యాయామం చేయడానికి ఇంకో ప్లేస్ దొరకలేదా నాయనా.. అక్కడి నుంచి పడితే కథ కంచికే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook