Russia Ukraine War: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్య కుట్ర భగ్నం...
Russia Ukraine War Updates: ఇరు దేశాల మధ్య ఇప్పటికీ నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవేవీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. యుద్ధం కారణంగా ఇప్పటికే వేలాది మంది సాధారణ పౌరులతో పాటు ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Russia Ukraine War Updates: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 33వ రోజుకు చేరింది. ఉక్రెయిన్‌ని వినాశనం చేసేవరకూ రష్యా శాంతించేలా కనిపించట్లేదు. ఓవైపు ఉక్రెయిన్ నగరాలపై దాడులకు పాల్పడుతూనే మరోవైపు ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీని కూడా టార్గెట్ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో జెలెన్‌స్కీపై ఇప్పటికే మూడుసార్లు రష్యా హత్యాయత్నం చేసిందని ఉక్రెయిన్ వర్గాలు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి జెలెన్‌స్కీ హత్యకు రష్యా కుట్ర పన్నిందని.. అయితే ఆ కుట్రను ఉక్రెయిన్ వర్గాలు భగ్నం చేశాయని ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఉక్రెయిన్‌కి చెందిన 'కీవ్ పోస్ట్' వార్తా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. రష్యన్ స్పెషల్ సర్వీసెస్‌కి చెందిన 25 మంది గ్రూప్‌ను స్లొవేకియా-హంగేరీ సరిహద్దులో ఉక్రెయిన్ బలగాలు పట్టుకున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని లేకుండా చేయడమే వారి లక్ష్యమని పేర్కొన్నారు. రష్యా తమపై యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి.. పుతిన్ టార్గెట్ తానే అని జెలెన్‌స్కీ పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. రష్యా భయానికి జెలెన్‌స్కీ దేశం విడిచి పారిపోయారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని.. ఉక్రెయిన్‌లోనే ఉన్నానని జెలెన్‌స్కీ కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇరు దేశాల మధ్య ఇప్పటికీ నాలుగు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవేవీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. యుద్ధం కారణంగా ఇప్పటికే వేలాది మంది సాధారణ పౌరులతో పాటు ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా టర్కీ వేదికగా రెండు దేశాలు ఐదో దఫా చర్చలకు సిద్ధమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులోని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతమైన డాన్బాస్ స్టేటస్‌పై తటస్థంగా ఉండేందుకు, రాజీపడేందుకు తాము సిద్ధమని జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యాతో చర్చలకు ముందు జెలెన్‌స్కీ చేసిన ఈ ప్రకటనతో శత్రు దేశం దిగి వస్తుందా చూడాలి. తాజా చర్చలతోనైనా యుద్ధానికి తెరపడుతుందా అని ఉక్రెయిన్ వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: PBKS vs RCB Records: అరుదైన రికార్డు నెలకొల్పిన పంజాబ్.. బెంగళూరు ఖాతాలో చెత్త రికార్డు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook