Indian Student Dies in Ukraine: ఉక్రెయిన్​లో తాజాగా భారత్​కు చెందిన మరో విద్యార్థి నేడు (మార్చి 2) ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్​కు చెందిన చందన్ జిందాల్ అనే 22 ఏళ్ల మెడికల్ విద్యార్థి.. బుధవారం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్​ కారణంగా చందన్​ లాల్​ మృతి చెందాడు అనేది ఆ మీడియా కథనాల సారాశం. అయితే ప్రస్తుతం రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్​లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో ఉన్న ప్రజలంతా బిక్కు బిక్కుంటూ.. ఎప్పుడు ఏం జరుగుతుందే తెలీక ఆందోళన చెందుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉక్రెయిన్​పై నిన్న రష్యా చేసిన మిస్సైల్ దాడిలో కర్ణటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్​ మృతి చెందటంతో.. దేశవ్యాప్తంగా ఆందోళనలు కలిగించింది. ఈ ఘటన మరవక ముందే.. మరో విద్యార్థి ఇలా అకాల మరణం చెందటం విచారకరం.


ఇప్పటికే ఖర్కేవ్​ నగరాన్ని వీడిన విద్యార్థులు..


ఉక్రెయిన్​పై రష్యా దాడుల విషయంలో రష్యా స్పీడు పెంచిన నేపథ్యంలో ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల నుంచి భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలను వీడినట్లు కూడా తెలిసింది.


Also read: Joe Biden confuse: జో బైడెన్​ స్పీచ్​లో తడబాటు.. జోకులు వేస్తున్న నెటిజన్లు!


Also read: Russia Ukraine War: యుద్ధ కాలాన ఆపన్న హస్తం.. కీవ్‌లో ఉచిత షెల్టర్, ఆహారం అందిస్తోన్న ఇండియన్ రెస్టారెంట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook