కరోనా వైరస్‌ (CoronaVirus)ను ఎదుర్కోవడానికి యాంటీబాడీ (Antibodies)లు కీలకమని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు భావించారు. వాస్తవానికి మన శరీరంలో రోగ నిరోధకశక్తికి యాండీబాటీలు కీలకమని తెలిసిందే. క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్‌లతో పోరాడి మనల్ని అనారోగ్యం బారిన పడకుండా ఇవి కాపాడతాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఓ కీలక అంశాన్ని లండన్ లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు గుర్తించారు. AP: ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగింపు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ బారిన పడ్డ వారు అతి త్వరగా, తక్కువ కాలంలోనే యాంటీబాడీలను భారీగా కోల్పోతున్నారు. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని (Immunity Power) తక్కువ కాలంలోనే పేషెంట్లు కోల్పోతున్నారని తాజా పరిశోధనలో తేలింది. ఈ కారణంగా కోవిడ్19 (Covid-19) నుంచి కోలుకున్న వారు మళ్లీ మళ్లీ అదే కరోనా వైరస్ బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. పెరిగిన బంగారం ధర.. రికార్డు ధరకు వెండి


మరో అంశం ఏంటంటే.. మన శరీరం కరోనాకు దీటైన యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తోంది. అయితే అతికొద్ది కాలంలోనే ఈ యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని కింగ్స్ కాలేజ్ రీసెర్చ్‌ను నడిపించిన డా. కేటీ డూరెస్ తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కోవిడ్19 వ్యాక్సిన్లను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు పని చేస్తున్నాయని చెప్పారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


యాంటీబాడీలు కేవలం మూడు నెలల వ్యవధిలో తగ్గిపోతున్నాయంటే.. వ్యాక్సిన్ ప్రభావం సైతం అంతకాలానికే పని చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. అంటే కోవిడ్19 వ్యాక్సిన్ ఒక్కసారి తీసుకుంటే సరిపోదని, మళ్లీ మళ్లీ వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా వైరస్ రెండోసారి సోకితే.. వారిలో తీవ్రత తక్కువగా ఉంటుందని, గతంలో ఎదుర్కొన్న అనుభవంతో యాంటీబాడీలు వైరస్‌పై మెరుగైన ప్రతిదాడి చేస్తాయని రీసెర్చ్ టీమ్‌లోని మరో డాక్టర్ భావిస్తున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..