తప్పు చేస్తున్నావ్ ఇమ్రాన్.. ఓవర్ యాక్షన్ తగ్గించుకో: అమెరికా హితబోధ
భారత్ విషయంలో పాకిస్థాన్ సర్కార్ తీరును తప్పబట్టిన అమెరికా... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు క్లాస్ పీకింది
వాషింగ్టన్: కశ్మీర్ కు సంబంధించిన ఆక్టికల్ 370 రద్దును నిరసిస్తూ పాక్ చూపిస్తున్న అత్యుత్సాహంపై అమెరికా స్పందించింది. భారత్ విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరి సరికాదని అమెరికా తేల్చింది . ఈ అంశంపై అమెరికా స్పందిస్తూ ఇరు దేశాల వైఖరిని గమనిస్తున్నామని ... ఆయా అంశాల్లో చోటు చేసుకుంటున్న పురోగతులను మేం చూస్తూనే ఉన్నామని పేర్కొంది. ఈ విషయంలో పాక్ దూకుడు తగ్గించుకోవాలని హితో బోధ చేసింది.
కశ్మీర్ లో విషయంలో భారత్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం పాక్ కు ఏమాత్రం మింగుపడటం లేదు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనకు నిరసిస్తూ భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్‌తో వాణిజ్యం రద్దు, దౌత్య సంబంధాలను కనిష్ఠ స్థాయికి చేర్చడం తో పాటు హైకమిషనర్ అజయ్ బిసారియా బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. అలాగే పాకిస్థాన్ లోని భారత రాయబారిని బహిష్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఈ మేరకు స్పందించింది.
ఇటీవలెకాలంలో కశ్మీర్ విషయంలో మధ్యవహిత్వం వహిస్తానని ట్రంప్ వ్యాఖ్యనించడంతో భారత్ దాన్ని తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమాధికారంలో ఎవరూ తలదూర్చాల్సిన అవసరం లేదని అమెరికాకు భారత్ తెగేసి చెప్పింది. దీంతో నాలుక కర్చుకున్న ట్రంప్ వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో ఇప్పడు అమెరికా ఈ మేరకు స్పందించడం గమనార్హం.