భారత్‌తో దోస్తీ కట్; ఇమ్రాన్ సర్కార్ కీలక నిర్ణయం
కశ్మీర్ విషయంలో భారత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇమ్రాన్ సర్కార్ ఓవర్ యాక్షన్ ప్రదర్శిస్తోంది
పులిని చూసి నక్క వాత వేసుకున్నట్లుగా ఉంది పాక్ సర్కార్ పరిస్థితి. ఎవరో ...ఏదో అన్నారని ఊరిమీద అలిగినట్లుగా ఉంది ఇమ్రాన్ ఖాన్ వ్యవహార శైలి. జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన, ఆర్టికల్ 370 రద్దు చేయడమనేది భారతదేశ అంతర్గత అంశం. భారత పార్లమెంట్ తన విశేష అధికారాలు ఉపయోగించింది ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఇతర దేశాల అభ్యంతాలు కానీ..సమర్థింపులు కానీ అవసరం లేదు.
ఇమ్రాన్ ఖాన్ ఓవర్ యాక్షన్
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంపై ఓవర్ యాక్షన్ ప్రదర్శిస్తున్నారు. తమకు ఏమాత్రం సంబంధం లేని కశ్మీర్ అంశంపై ఇమ్రాన్ ఖాన్ ప్రతేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మరి దీన్ని ఖండించారు. ఈ చర్యకు నిరసన వ్యక్తం చేస్తూ కశ్మీర్ లో పుల్వామా తరహా దాడులు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు పక్క దేశంలో ఏం జరిగితే ఆయనకు ఎందుకంత ఆందోళన అంటూ సగటు భారతీయుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంతటితో ఆగకుండా భారత్‌తో సంబంధాలపై పాక్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు
పాక్ సర్కార్ నిర్ణయాలు ఇవే
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన సమావేశమైన ఆ దేశ జాతీయ భద్రతా కమిటీ భేటీలో భారత్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇమ్రాన్ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే ... కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ పాకిస్థాన్ భారత రాయబారిని బహిష్కరించింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని.. దౌత్య సంబంధాలు కూడా తగ్గించాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్ లోని పాకిస్తాన్ హై కమిషన్‌ను తిరిగి రప్పించాలని నిర్ణయించింది.
పాక్ చర్యలతో నష్టం ఏం లేదు..
దైపాక్షిక సంబంధాలపై పాక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న భారత్ కు ఎలాంటి నష్టం జరగదని.. అది ఏమైన ఉంటే పాక్ కే జరుగుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేవలం సరిహద్దు ప్రాంతంలో శాంతియుత పరిస్థితుల కోసమే .. పాక్ విషయంలో భారత్ సంయమనం పాటిస్తోంది..ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కోరుకుంటోంది. అంతే తప్పితే ఇందులో భారత్ కు వనగూరే ప్రయోజనాలు శూన్యం. భారత్ విషయంలో పాక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ..అది పాక్ కు నష్టం తప్పితే భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండబోదని మేధావులు అభిప్రాయపడుతున్నారు