Asteroid Hit: ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు ప్రకృతి విలయాలు. ఇవి చాలదన్నట్టు మరో ఉపద్రవం ముంచుకు వస్తోందనే కలవరం రేగుతోంది. అతి వేగంతో భూమి వైపుకు ఆస్టరాయిడ్ దూసుకొస్తోంది. నాసా చెబుతున్న డెడ్‌లైన్‌లోగా ఏం జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కల్గిస్తున్న కరోనా మహమ్మారి(Corona Pandemic)నుంచి తేరుకోకముందే మరో ప్రమాదం ముంచుకొస్తోంది. ప్రపంచాన్ని కలవరపెడుతోంది. భూమి వైపుకు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్స్ రూపంలో ఆ ప్రమాదం వస్తోంది. అదృష్టవశాత్తూ చాలా వరకూ గ్రహశకలాలు భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లిపోతున్న సందర్భాలే అధికంగా ఉన్నాయి. కానీ ఈసారి దూసుకొస్తున్న గ్రహ శకలం భూమిని ఢీ కొట్టవచ్చని తెలుస్తోంది. తాజా ఆస్ట్రాయిడ్‌ భూమికి దగ్గరగా వచ్చి పోతుందా? లేదా ఢీ కొడుతుందా..? అసలు ఆ గ్రహశకలాన్ని అడ్డుకునే టెక్నాలజీ నాసాకు  ఉందా ?


దశాబ్దాల కాలంగా గ్రహశకలాల (Asteroids)వల్ల భూమికి పొంచి ఉన్న ప్రమాదాలను ఖగోళ శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. 6.5 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల 70శాతం జీవరాశులు అంతరించిపోయాయి. గ్రహశకలాలు ఢీకొనడం వల్ల సునామీలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, కార్చిచ్చులు వ్యాపిస్తాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. కైనెటిక్ ఇంపాక్టర్ టెక్నాలజీ గ్రహశకలాల వేగం, మార్గాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. భూమికి ఇలాంటి విపరీత విపత్తుల నుంచి కాపాడుకోవడానికి ఈ మిషన్ ద్వారా అవకాశం ఉంది.


ప్రస్తుతం భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం(Asteroid may hit the earth) 330 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది డిసెంబర్ 11న భూమికి దగ్గరగా వస్తుంది. ఇది సెకండ్‌కి 6.58 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. అంటే ఈ గ్రహశకలం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 90 సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే వెళ్లగలదు. ఇంతటి వేగంతో దూసుకొస్తున్న గ్రహశకలం భూమిని ఢీ కొడుతుందా లేదా ఎప్పటిలానే పక్కనుంచి వెళ్లిపోతుందా అనేది తెలియడం లేదు. ఒకవేళ ఢీ కొడితే మాత్రం ముప్పు ఎక్కువే ఉండవచ్చనేది ఓ అంచనా..నాసా (NASA)త్వరలో ప్రయోగించనున్న వ్యోమనౌక ద్వారా కాస్మిక్ ముప్పు నుంచి భూమిని రక్షించవచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా వ్యోమనౌకతో గ్రహశకలాన్ని ఢీ కొట్టి పరీక్షించనుంది. ఈ మిషన్ విజయవంతమైతే..భవిష్యత్‌లో ఎదురయ్యే ముప్పును సునాయసంగా ఇటువంటి సాంకేతికతతో జయించవచ్చు. 


Also read: కుల్​భూషణ్​ జాదవ్​కు​ ఊరట- కీలక బిల్లుకు పాక్​ పార్లమెంట్​ ఆమోదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook