Pakistan: పోలీసు స్టేషన్‌లో బ్లాస్ట్.. 12 మంది మృత్యువాత, 40 మందికిపైగా గాయాలు..
Pakistan: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. పోలీసు స్టేషన్‌లో జరిగిన పేలుళ్లలో 12 మంది పోలీసులు దుర్మరణం చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు.
Swat police station blast: పాకిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. స్వాత్‌లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సిటిడి) పోలీసు స్టేషన్‌లో జరిగిన పేలుళ్లలో 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్ లోపల జరిగిన రెండు పేలుళ్లలో భవనం మెుత్తం ధ్వంసమైందని పోలీసులు తెలిపారు.
భద్రతా అధికారులు ప్రావిన్స్ అంతటా "అత్యంత అప్రమత్తంగా" ఉన్నారని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు. పేలుడు ఆత్మాహుతి దాడి కాదని, మందుగుండు సామాగ్రి మరియు మోర్టార్ షెల్స్‌ను నిల్వ ఉంచిన ప్రదేశంలో పేలుడు జరిగిందని సీటీడీ డీఐజీ ఖలీద్ సోహైల్ చెప్పారు. పోలీస్ స్టేషన్‌పై ఎలాంటి దాడి, కాల్పులు జరగలేదని ఆయన అన్నారు.
పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని.. కేసును విచారించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్నాయని ఆయన తెలిపారు. కూలిన భవనం పాతదేనని, చాలా కార్యాలయాలు, సిబ్బంది కొత్త భవనంలో ఉన్నారని సీటీడీ డీఐజీ తెలిపారు. భవనం కుప్పకూలడం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. మరోవైపు రీజనల్ హెల్త్ డిపార్టమెంట్ స్వాత్‌లోని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని విధించింది.
Also Read: Burkina Faso: మిలటరీ దుస్తుల్లో వచ్చి.. 60 మందిని చంపేశారు..!
మరోవైపు జిల్లా పోలీసు అధికారి షఫీ ఉల్లా గండాపూర్ (DPO) పోలీస్ స్టేషన్ ఆత్మాహుతి దాడి జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. మృతి చెందిన వారి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
Also read: Kenya Deaths: భయానక ఘటన.. జీసస్‌ను కలిసేందుకు ఆకలితో అలమటించి 47 మంది ఆత్మహత్య..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.