Fire accident in Osaka-Japan: జపాన్‌లోని ఒసాకా నగరంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఎనిమిదంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ 27 మంది కార్డియాక్ అరెస్ట్ వల్లే చనిపోయారని స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెల్లడించడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒసాకాలోని ఎనిమిదంతస్తుల ఆ భవనంలో నాలుగో అంతస్తులో మంటలు (Osaka fire accident) చెలరేగాయి. నాలుగో అంతస్తులోని ఓ సైకియాట్రీ క్లినిక్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఉదయం 10గం. సమయంలో క్లినిక్‌ను తెరవగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రమాదానికి గల కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు. అయితే ఓ వృద్దుడి సంచి నుంచి మండే స్వభావం గల ద్రవ పదార్థం లీకవడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక పత్రిక పేర్కొంది. నాలుగో అంతస్తులోని సైకియాట్రీ క్లినిక్‌లో అతను ట్రీట్‌మెంట్ కోసం వచ్చినట్లు తెలిపింది.


ప్రమాద ఘటనపై 36 ఏళ్ల ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో (Fire accident) నాలుగో అంతస్తులోని కిటికీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని చెప్పారు. లోపల ఉన్న ఓ మహిళ తనను కాపాడాలంటూ రెండు చేతులు ఊపడం తనకు కనిపించిందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తమ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో 2019లో క్యోటోలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. ఆ ఘటన తర్వాత ఇదే భారీ అగ్నిప్రమాదంగా చెబుతున్నారు.


Also Read: Pushpa: పుష్ప సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్... ఖతర్నాక్ అంటున్న ఫ్యాన్స్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook