Pushpa: పుష్ప సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్... ఖతర్నాక్ అంటున్న ఫ్యాన్స్...

Pushpa Second Part title: అల్లు అర్జున్-రష్మిక మందనా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ పార్ట్‌లోనే సెకండ్ పార్ట్ టైటిల్ కూడా రివీల్ చేసేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 10:36 AM IST
  • నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప
  • హిట్ టాక్ సొంతం చేసుకున్న పుష్ప
  • సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్
Pushpa: పుష్ప సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్... ఖతర్నాక్ అంటున్న ఫ్యాన్స్...

Pushpa Second Part title: పుష్ప... ప్రస్తుతం ఏ సినీ ప్రేక్షకుడి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. 'తగ్గేదేలే...' అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన ఊర మాస్ పెర్ఫామెన్స్‌ను వెండి తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. అటు ఫ్యాన్స్ టాక్ (Pushpa Public Talk)... ఇటు సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం పుష్ప ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పుష్ప పార్ట్-1 ఎండింగ్‌లో సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్ చేసేశారు.

రెండో పార్ట్‌కు 'పుష్ప-ది రూల్' (Pushpa The Rule) అనే టైటిల్ పెట్టారు. స్క్రీన్‌పై ఈ  టైటిల్‌ను చూడగానే థియేటర్‌లో ఫ్యాన్స్ విజిల్స్, కేరింతలతో హోరెత్తిస్తున్నారు. సెకండ్ పార్ట్‌కు ఖతర్నాక్ టైటిల్ పెట్టారని అభిప్రాయపడుతున్నారు. మొదటి పార్ట్‌లో బన్నీ మాస్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్.. రెండో పార్ట్ నెక్ట్స్ లెవల్‌లో ఉండొచ్చు అని చర్చించుకుంటున్నారు. మొదటి పార్ట్‌లో అల్లు అర్జున్‌తో పాటు శ్రీవల్లిగా రష్మిక, మంగళం శీనుగా సునీల్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడుతున్నాయి.

పుష్ప హిట్ టాక్‌తో అల్లు అర్జున్-సుకుమార్ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లయింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా అనౌన్స్ చేసింది మొదలు.. సినిమా నుంచి వచ్చిన ఒక్కో అప్‌డేట్‌తో హైప్ మరింత పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 'తగ్గేదేలె...'  అంటూ అల్లు అర్జున్ (Allu Arjun Pushpa) చెప్పిన డైలాగ్... ఆ బాడీ లాంగ్వేజ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడా పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్‌ను థియేటర్స్‌లో ఫ్యాన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: Pushpa First Review: అల్లు అర్జున్ పుష్ప సినిమా అదుర్స్.. బెస్ట్ టాలీవుడ్ 2021 సినిమా అంటున్న రివ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News