Indians In Ukraine: షాకింగ్ న్యూస్! ఉక్రెయిన్ నుంచి వెళ్లాలనుకునే ఇండియన్స్‌ని కొడుతున్నారా?
Indians In Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రతపై రోజు రోజుకు ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థి మరణించడం, దేశం వీడాలనుకుంటున్న వారిపై అక్కడి సిబ్బంది దాడులు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇందుకు కారణం.
Indians In Ukraine: రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లింది. యుద్ధం ఇంకా కొనసాగుతున్న కారణంగా ఆ దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలంతా ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నరు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆపరేషన్ గంగా పేరుతో భారతీయులకోసం ప్రత్యేక విమానాలు నడిపిస్తోంది.
అయితే ఉక్రెయిన్ వీడుతున్న భారతీయులపై అక్కడి భద్రతా సిబ్బంది దాడులు చేస్తున్నట్లు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ గంగాలో భాగంగా సురక్షితంగా స్వస్థలానికి చేరిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని సంచనల విషయాలను బయటపెట్టింది.
విద్యార్థులు స్వదేశానికి వెళేందుకు ప్రయత్నిస్తుంటే.. అక్కడి రక్షణ సిబ్బంది వారిపై దాడులు చేస్తున్నట్లు ఆ విద్యార్థిని చెప్పుకొచ్చింది. శృతి నాయక్ అనే ఆ విద్యార్థిని ఉక్రెయిన్‌లోని ఇవానో నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువతోంది. ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలే ఎయిర్ఇండియా ప్రత్యేక విమానం ఇండియాకు చేరింది.
ఇటీవలే విద్యార్థులపై దాడులు జరుగుతున్నట్లు వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ యువతి చెబుతున్న విషయాలు అక్కడ పరిస్థితులు ఎలా దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఆ యువతి ఇంకా ఏం చెప్పిందంటే..
'ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ భయాలు ఉన్న ప్రాంతాల నుంచి వెళ్తున్న విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. అదృష్టవశత్తు నేను ఇండియాకు చేరుకున్నారు. అంతకు ముందే ఫిబ్రవరి 16న ఇండియాకు టికెట్ బుక్ చేసుకున్నాను. కానీ విమానం రద్దయింది.' అని ఆ విద్యార్థి ఆందోళనరమైన వియాలను వెల్లడించింది.
తాను మార్చి 3 కోసం కూడా ఓ టికెట్ బుక్ చేయగా ఆ విమానం కూడా క్యాన్సిల్ అయినట్లు తెలిపింది. దీనితో బస్సులో 400 కిలోమీటర్లు ప్రయాణించి.. ఫిబ్రవరి 26 రొమానియా చేరుకున్నట్లు చెప్పింది. మరుసటి రోజు (ఫిబ్రవరి 27న) ఢిల్లీకి చేరుకున్నట్లు వివరించింది.
భారత విద్యార్థి మృతి
దాడులు, విద్యార్థులను సురక్షితంగా వెనక్కి రప్పించే ప్రయత్నాలు జరుగుతుండగా.. మంగళవారం ఓ దుర్ఘటన జరిగిది. కర్ణాటకకు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి రష్యా మిస్సైల్ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో యావత్ దేశం షాక్‌కు గురైంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మిగతా భారతీయుల భద్రతపై దేశవ్యాప్తంగా భయాలు భయాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: Kacha Badam singer Bhuban: 'కచ్చా బాదమ్' సింగర్‌కు రోడ్డు ప్రమాదం.. ఆస్పత్రిలో చేరిక..
Also read: Jharkhand Boat Accident: జార్ఖండ్‌లో విషాదం...నదిలో పడవ బోల్తా.. 14 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook