Bangladesh Fire Accident: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident in Bangladesh) సంభవించింది. ఏడు అంతస్తుల రెస్టారంట్‌లో మంటలు చెలరేగి 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 20 మందికిపైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న 42 మందితో సహా 70 మంది వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజధాని ఢాకాలోని బైలే రోడ్డులో గ్రీన్​ కోజీ కాజేట్​ పేరుతో.. ఓ కమర్షియల్​ షాపింగ్​ కాంప్లెక్స్ ఉంది. అందులో అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. గురువారం రాత్రి 9 గంటల 45 నిమిషాల సమయంలో.. మొదటి అంతస్తులోని 'కచ్చి భాయ్​' అనే బిర్యానీ రెస్టారెంట్​లో మంటలు చెలరేగాయి. అవి క్రమంగా పై అంతస్తులకు విస్తరించాయి. ఫైర్ యాక్సిడెంట్ సమయంలో.. రెస్టారెంట్లలో చాలా మంది భోజనం చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. కొందరు ఏకంగా బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు పొగకు ఊపిరి ఆడక మృతి చెందారు. ఇంకొందరు కాలిన గాయాలతో బయటపడ్డారు. 



సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 13 ఫైర్​ సర్వీస్​ యూనిట్​లు తీవ్రంగా శ్రమించి మంటలను అర్పివేశాయి. ఆరోగ్య శాఖ మంత్రి సమంత లాల్​ సేన్​ ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఇలాంటి ప్రమాదాలు జరగడం కామన్.  2021 జులైలో ఓ ఆహార శుద్ధి పరిశ్రమలో చెలరేగిన మంటల్లో అనేక మంది పిల్లలు సహా 52 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: Europe Farmers Protest: ఢిల్లీలోనే కాదు..యూరోప్ దేశాల్లో కూడా అన్నదాతల నిరసనలు


Also Read: Indian Origin: అమెరికాలో మరో విషాకర ఘటన.. భారత జర్నలిస్ట్ మృతి.. కారణం ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook