Indian Journalist Fazil khan Died In Fire Accident: అమెరికాలోని న్యూయార్క్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్‌లోని హార్లెన్‌లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో 27 ఏళ్ల భారతీయ జర్నలిస్ట్ మరణించాడు. చనిపోయిన వ్యక్తి ఫాజిల్ ఖాన్ గా గుర్తించినట్లు భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
దీనిపై రాయబార కార్యాలయం ఫాజిల్ ఖాన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం భారతకు అతని మృత దేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. న్యూయార్క్...లోని హార్లెమ్ అపార్ట్ మెంట్ భవనంలో దురదృష్టవశాత్తూ అగ్ని ప్రమాదంలో సంభవించింది.
ఈ ఘటనలో.. 27 ఏళ్ల భారతీయ జాతీయుడు మిస్టర్ ఫాజిల్ ఖాన్ చిక్కుకుని మరణించినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు అలర్ట్ అయి, వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ.. అప్పటికే ఫాజిల్ ఖాన్ చనిపోయినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి కారణం.. ద్విచక్రవాహనంలోని లిథియం అయాన్ బ్యాటరీ వల్ల కావొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటల భారీ ఎత్తున వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో మరకొందరు కిటీకిలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. దీనిపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారత సంతతి వ్యక్తి చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
Read More: Semiya Upma Recipe: సేమియా ఉప్మా రెసిపీని కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసుకోండి ఇలా!
ఇదిలా ఉండగా.. చనిపోయిన వ్యక్తి ఫాజిల్ ఖాన్.. ప్రముఖ మీడియా సంస్థలల్లో కాపీ రైటర్ గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఫాజిల్ ఖాన్.. డిగ్రీ పూర్తి చేసేందుకు 2020 లో న్యూయార్క్ కు వెళ్లారు. ఆ తర్వాత జర్నలిజం స్కూల్ లో చేరి కోర్సును పూర్తిచేశాడు. యువ జర్నలిస్ట్ అకాల మరణంతో ప్రస్తుతం తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, గత కొన్నిరోజులుగా అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తులు చనిపోవడం తీవ్ర దుమారంగా మారింది. దీంతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook