BAPS Temple Special Features: ప్రపంచంలో హిందూ మతానికి ఆదరణ పెరుగుతోంది. భారత్‌లో అయోధ్య ఆలయం ప్రారంభోత్సవంతో ప్రపంచ దేశాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి. ఆలయ ప్రారంభోత్సవానికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిందూ భక్తులు కూడా తరలివచ్చారు. ఇక విదేశాల్లో స్థిరపడ్డ హిందూవులు అక్కడ తమ మతభావాలను చాటుకుంటున్నారు. ఆయా దేశాల్లో హిందూవుల జనాభా పెరుగుతుండడంతో అక్కడి దేశాలు కూడా హిందూ మందిరాలను నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూఏఈలో ఆలయం ప్రారంభమైంది. ఆ దేశ రాజధాని అబుదాబిలో బుధవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆలయంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. అక్కడ నిర్మించిన ఆలయ విశేషాలు ఇవే.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!


ఆలయం పేరు: బోచసన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ. సంక్షిప్త రూపంలో 'బాప్స్‌' ఆలయంగా పిలుస్తున్నారు.


- యూఏఈలోనే కాక మధ్యప్రాచ్యంలోనే మొత్తం హిందూ సంప్రదాయ రీతిలో నిర్మాణమైన తొలి రాతి ఆలయం ఇది.
- దుబాయ్‌- అబుదాబి జాతీయ రహదారి సమీపంలో 27 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మాణం.
- 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం నిర్మించారు.
- ఆలయ నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చు చేశారు.
- ఆలయ నిర్మాణానికి పట్టిన సమయం మూడు సంవత్సరాల ఆరు నెలలు.
- ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్‌, గుజరాత్‌కు చెందిన రెండు వేల మంది కార్మికులు, నిపుణులు పని చేశారు.
- ఆలయ నిర్మాణంలో ఏమాత్రం స్టీల్‌, కాంక్రీట్‌, సిమెంట్‌ వినియోగించలేదు.
- తెలంగాణలోని యాదాద్రి, అయోధ్యలో రామాలయం మాదిరి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాళ్లతో నిర్మించారు.
- ఆలయంలో ఏడు గోపురాలు ఉంటాయి. ఆ ఏడు గోపురాలు ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దారు.
- తెల్ల రాళ్లను రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నుంచి, శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు.
- ఆలయ పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను ఏర్పాటుచేశారు. ఇవి భూకంపాలతోపాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను నిక్షిప్తం చేసి సమాచారం అందిస్తుంటాయి.
- ఆలయ ప్రాంగణంలో ప్రధాన మందిరంతోపాటు ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, ప్రత్యేక గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్‌ కేంద్రాలు, 5 వేల మంది పట్టే కమ్యూనిటీ హాళ్లు రెండు నిర్మించారు. ఇక పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


ఈ మందిరం నిర్మాణంతో భారతదేశంతో యూఏఈ పటిష్ట బంధానికి ప్రతీకగా నిలువనుంది. ఆ దేశ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని భారతీయులు, అక్కడి దేశ అధికారులు పేర్కొంటున్నారు.

Also Read: Valentines Day: ఆంటీకి చెప్పు వద్దని.. నేను నిన్నే చేసుకుంటానని బాయ్‌ఫ్రెండ్‌ ఫన్నీ రిప్లయ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook