Coronavirus Zombie Infection: జాంబీ ఇన్ఫెక్షన్ హెచ్చరిక.. కరోనా మృతదేహాలను తాకితే ఏమవుతుంది..?
BF 7 Variant in India: కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనాలో మృతదేహాల కుప్పలు భయాందోళనకు గురిచేస్తోంది. పలు దేశాలు ఆంక్షలు అమలు చేస్తుండగా.. మన దేశంలో కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది.
BF 7 Variant in India: కోవిడ్ దెబ్బకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ముఖ్యంగా చైనాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజలు జాంబీ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారని అంటున్నారు. జాంబీ ఇన్‌ఫెక్షన్ అంటే ఆరోగ్యవంతమైన వ్యక్తికి వైరస్ సోకితే.. అతని నుంచి ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది.
కోవిడ్ కారణంగా ఎవరైనా మరణిస్తే.. ఆ ఇన్ఫెక్షన్ మృతదేహం ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొత్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మృతదేహాలను ఖననం చేసే వ్యక్తులు జాంబీ ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. పాథాలజిస్ట్‌లు, మెడికల్ ఎగ్జామినర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, కోవిడ్ మరణాలు సంభవించే ఆసుపత్రులు లేదా నర్సింగ్ హోమ్‌లలో పనిచేసే వంటి వారు ప్రమాదంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో వ్యాధి సంక్రమణ వ్యాప్తి కారణంగా కేసులు ఎక్కువగా పెరుగుతాయి.
కోవిడ్ సోకి చనిపోయిన కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్‌లోని చిబా యూనివర్శిటీ పరిశోధకుడు హిసాకో సైతో కీలక సూచనలు చేశారు. కొన్ని దేశాల్లో కోవిడ్‌తో మరణించిన వ్యక్తుల మృతదేహాలను నేరుగా ఖననం చేయకుండా ఇంటికి తీసుకువెళుతున్నారని.. చాలా ప్రమాదకరమని అన్నారు. జాంబీ ఇన్ఫెక్షన్ గురించి సాధారణ ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.
2020 సంవత్సరంలో జపాన్ ప్రభుత్వం కరోనా సోకి చనిపోయిన మృతదేహానికి దూరంగా ఉండాలని అలాగే దానిని తాకవద్దని కోరింది. మృతదేహాలను సంచుల్లో మూసి ఉంచి 24 గంటల్లో వీలైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు సూచించారు. మరణం తర్వాత 17 రోజుల వరకు శవాలలో అంటు వైరస్‌లను అనేక అధ్యయాల్లో గుర్తించారు. డాక్టర్ సైతో, అతని సహచరులు కోవిడ్‌తో మరణించిన 11 మంది ముక్కు, ఊపిరితిత్తుల నమూనాలను పరిశీలించారు. మరణించిన 13 రోజుల తర్వాత కూడా 11 మృతదేహాలలో ఆరింటిలో కరోనా వైరస్‌ను వారు గుర్తించారు. కోవిడ్ సోకి రోగి వెంటనే మరణించినప్పుడు.. శరీరంలో వైరస్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Also Read: Telangana Health Director: ఏసు క్రీస్తు వల్లే కరోనా నయం.. వివాదంలో డీహెచ్ శ్రీనివాసరావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook