Telangana Health Director: ఏసు క్రీస్తు వల్లే కరోనా నయం.. వివాదంలో డీహెచ్ శ్రీనివాసరావు

DH Srinivasa Rao Controversial Comments: ఇటీవల సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వివాదంలో నిలిచిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. కరోనా తొలగిపోవడానికి ఏసు క్రీస్తు కారణం అంటూ వివాదస్పద రీతిలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 07:35 PM IST
  • మరో వివాదంలో డీహెచ్ శ్రీనివాసరావు
  • ఏసు క్రీస్తు వల్లే కరోనా నయమంటూ కాంట్రవర్సీ కామెంట్స్
  • తీవ్రస్థాయిలో మండిపడుతున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులు
Telangana Health Director: ఏసు క్రీస్తు వల్లే కరోనా నయం.. వివాదంలో డీహెచ్ శ్రీనివాసరావు

DH Srinivasa Rao Controversial Comments: ఏసు క్రీస్తు వల్లే కరోనా నయం అయిందంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్ పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఏసు క్రీస్తు కృప వల్లే కోవిడ్ నుంచి మనం అందరం విముక్తి అయ్యామన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఏసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ.. ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చేయాలని పిలుపునిచ్చారు డీహెచ్ శ్రీనివాసరావు. ఇంతకు ముందు జరుపుకున్న క్రిస్మస్‌లు వేరు.. ఇక నుంచి జరుపుకుబోయే క్రిస్మస్‌లు వేరని అన్నారు. రెండున్నరేళ్లుగా ప్రపంచ మానవాళికి ప్రశ్నార్థకంగా కరోనా మారిందని.. దాని నుంచి ఏసు క్రీస్తు కృప, ఏసు క్రీస్తు దైవం దయ ప్రభావంతో పూర్తిగా కోలుకున్నామని అన్నారు. 

ఇక ఇటీవలె సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి డీహెచ్ శ్రీనివాసరావు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన కేసీఆర్ కాళ్ల మొక్కారు. ఆయన వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

తాజాగా డీహెచ్ చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ నేతలు ఖండించారు. ఏసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాట్లాడటం ముమ్మాటికి తగదన్నారు. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా.. కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా హిందువులను కించపరిచే స్థాయిలో మాట్లాడటం తగదని తీవ్రంగా హెచ్చరించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం నేరం కాదా..? అని వారు ప్రశ్నించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే హైకోర్టులో ఆయనపై కేసు వేసి సస్పెండ్ చేసేదాకా పోరాడుతామని హెచ్చరించారు. అణువణువునా స్వార్థం ఉన్న శ్రీనివాసరావు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరువు మర్యాదలు గంగలో కలిపారన్నారు. 

Also Read: Bank Holidays in January 2023: బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. జనవరిలో సెలవులు ఇవే..  

Also Read: KL Rahul: టీమిండియాకు ఎదురుదెబ్బ.. కేఎల్ రాహుల్‌కు గాయం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News