Covaxin Clinical Trials: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను రద్దు చేస్తున్నట్టు బ్రెజిల్ దేశ ఆరోగ్య వ్యవహారాల నియంత్రణ విభాగం వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్(Covaxin) కొనుగోలు వ్యవహారంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుడంతో భారత్ బయోటెక్ కంపెనీ బ్రెజిల్ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ ఏడాది రెండవ, మూడవ త్రైమాసికరంలో 2 కోట్ల డోసుల్ని సరఫరా చేయాల్సి ఉంది. అవినీతి నేపధ్యంలో ఒప్పందం రద్దయింది. వ్యాక్సిన్ సరఫరాలో ముడుపులు, అవకతవకల ఆరోపణలపై బ్రెజిల్ సెనెట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఒప్పందం నేపధ్యంలో భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ కోవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ బ్రెజిల్‌లో చేపట్టాల్సి ఉంది. ఒప్పందం రద్దు కావడంతో క్లినికల్ ట్రయల్స్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు బ్రెజిల్ (Brazil) దేశపు ఆరోగ్య వ్యవహారాల నియంత్రణ విభాగం తెలిపింది.బ్రెజిల్ దేశంలో భారత్ బయోటెక్(Bharat Biotech) కంపెనీకు భాగస్వామిగా ప్రెసికా మెడికమెంటోస్ సంస్థ వ్యవహరించింది. ఆసుపత్రి పత్రాల సమర్పణ, స్థానిక తోడ్పాటు, లైసెన్స్ పంపిణీ, ఇన్సూరెన్స్, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్(Clinical trials) బాథ్యతలన్నీ ఈ సంస్థే చూసుకోవల్సి ఉండేది. 


Also read: Pegasus Spyware: పెగసస్ ప్రమాదకరమే, ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook