Ayodhya Temple BBC: అయోధ్య ఆలయంపై బ్రిటన్ పార్లమెంట్‌లో లొల్లి లొల్లి.. తప్పుడు కథనాలపై ఆగ్రహం
Bob Blackman: దశాబ్దాల పోరాటం.. శతాబ్దాల కల సాకారమవడంతో ప్రపంచవ్యాప్తంగా హిందూవులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే బ్రిటీష్ రాజ్యంలో మాత్రం తీవ్ర వివాదాస్పదమవుతోంది. అక్కడి జాతీయ మీడియా వ్యవహరించిన తీరుపై పార్లమెంట్‌లో లొల్లి లొల్లి అయ్యింది.
Britain Parliament: కనుల పండువగా.. కనీవినీ ఎరుగని రీతిలో ఇటీవల అయోధ్య రామందిర ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆలయం ప్రాణప్రతిష్ట వేడుకపై బ్రిటన్‌లో రచ్చరచ్చ జరుగుతోంది. ఆ దేశా జాతీయ మీడియా బీబీసీ వ్యవహరించిన తీరుపై వివాదం మొదలైంది. బ్రిటన్ పార్లమెంట్‌లో ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరిగింది. బ్రిటీష్ ఎంపీ బాబా బ్లాక్‌మెన్ బీబీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీ పక్షపాతంపై వ్యవహరించిందని మండిపడ్డారు.
అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై బీబీసీ ప్రసారాలు చేసింది. అయితే రామందిరంపై కాకుండా మసీదు ధ్వంసం చేసిన ప్రదేశంగా పేర్కొంటూ ప్రసారాలు చేయడం దుమారం రేపింది. మసీదు ధ్వంసం చేసిన ప్రదేశం అంటూ ఆలయంపై అక్కసు వెళ్లగక్కిన బీబీసీ తీరు సరికాదని ఎంపీ బాబా బ్లాక్‌మెన్ పేర్కొన్నారు. అయోధ్య ఆలయానికి 2000 ఏళ్ల చరిత్ర ఉందనే విషయాన్ని మరచిపోయిందని గుర్తుచేశారు. బీబీసీ తీరుపై చర్చ జరగాలని పట్టుబట్టారు.
Also Read: Lemon in Auction: వేలంలో రూ.1.5 లక్షలు పలికిన నిమ్మకాయ.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
'రాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగడంపై ప్రపంచవ్యాప్తంగా హిందూవులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. బీబీసీ మాత్రం తన ప్రసారాల్లో ఇది మసీదు ధ్వంసం చేసిన ప్రదేశం అని చెప్పడం చాలా విచారకరం. ఇది చాలా దురదృష్టకరం. 2 వేల ఏళ్ల ముందు నుంచి అక్కడ ఆలయం ఉన్న విషయాన్ని బీబీసీ మరచిపోయింది. పట్టణానికి సమీపంలోని ఐదెకరాల స్థలాన్ని మసీదుకు కేటాయించారు. ఆ స్థలంపై బీబీసీ ప్రసారాలు చేసింది. బీబీసీ నిష్పాక్షికత, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో సరైన సమాచారాన్ని అందించాలి. బీబీసీ వైఫల్యంపై ప్రభుత్వం చర్చకు సమయం ఇవ్వాలి' అని బాబా బ్లాక్‌మెన్ పార్లమెంట్‌లో కోరారు.
కాగా అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవంపై బ్రిటన్ పార్లమెంట్‌లో ఇటీవల సంబరాలు జరిగిన విషయం తెలిసిందే. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కీర్తనలతో బ్రిటీష్ పార్లమెంట్ మార్మోగింది. ఈ సందర్భంగా చేసిన ప్రదర్శనలు అందరినీ భక్తిపారవశ్యంలోకి నెట్టాయి. జనవరి 22వ తేదీన అట్టహాసంగా జరిగిన ప్రాణప్రతిష్టతో అయోధ్యలో రామ మందిరం గొప్పగా ప్రారంభమైంది. ఈ ఆలయానికి రోజురోజు భక్తుల తాకిడి పెరుగుతోంది. ప్రారంభించిన పదిహేను రోజుల్లోనే దాదాపు అరకోటికి చేరువలో భక్తులు దర్శించుకున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో దేశ, విదేశాల నుంచి వస్తున్న భక్తులతో అయోధ్య ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులు ఇప్పుడే ఆలయానికి రావొద్దని ఆలయ ట్రస్ట్ సూచనలు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook