Lemon in Auction: నిమ్మకాయ ఆశ్చర్యకరంగా ఏకంగా లక్షల్లో ధర పలకడం మీరెప్పుడైనా గమనించారా? అవును ఇప్పుడు అదే జరిగింది. ఈ నిమ్మకాయ ఎందుకు అంత ప్రత్యేకమైంది తెలుసుకుందాం.
ఇంగ్లాండ్ లోని ఓ కుటుంబం తమ ఇంటిని శుభ్రం చేస్తుండగా 19వ శతాబ్దానికి చెందిన ఓ వ్యక్తి అల్మారాలో 285 ఏళ్ల నాటి నిమ్మకాయ కనిపించింది. దాదాపు రూ.1.5 లక్షలకు ఆ నిమ్మకాయ వేలం వేసినట్లు చెబుతున్నారు.
నిమ్మకాయ మన ఆహార రుచిని మెరుగుపరుస్తుంది. మనం దానిని ఎక్కడైనా చాలా తక్కువ ధరకు పొందవచ్చు. అయితే ఈ నిమ్మకాయ దాదాపు లక్షా ఐదు వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ నిమ్మకాయ తినడానికి అస్సలు సరిపోదు. బ్రిటిష్ మీడియా నివేదికల ప్రకారం కొంతమంది తమ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు 19వ శతాబ్దానికి చెందిన నిమ్మకాయను కనుగొన్నారు. ఇది 2 అంగుళాలు ఉండి గోధుమ రంగులో వాడిపోయిన నిమ్మకాయ.
ఇదీ చదవండి: Zero Income Tax Countries: ఇక్కడ కావాల్సినంత డబ్బు సంపాదించుకోవచ్చు.. ఒక్కపైసా కూడా పన్ను కట్టక్కర్లేదు..
ఇది తమ అంకుల్ 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తిదని దీన్ని అమ్మడం ద్వారా తమకు మంచి ధర లభిస్తుందని వారు భావించారు. అయితే, వేలంలో పెట్టెను తీసుకొని చిత్రాన్ని తీసినప్పుడు నిమ్మకాయ సుమారు 285 సంవత్సరాల నాటిదని 'ది సన్' ప్రచురించింది. అంతేకాదు ఈ వాడిన నిమ్మకాయపై మిస్టర్ పి. లౌ ఫ్రాంచినీ మిస్ ఇ బాక్స్ టర్ 1739 నవంబర్ 4న గిఫ్ట్ గా ఇచ్చారని రాసి అని ఉంది. ముఖ్యంగా ఈ నిమ్మకాయను భారత్ నుంచి ఇంగ్లాండ్‌కు తీసువచ్చినట్లు నమ్ముతారు.
ఇదీ చదవండి: Pak Punjab Tragedy: ఘోరవిషాదం.. పాకిస్తాన్ పంజాబ్ లో 220 చిన్నారుల మృత్యువాత..
ఈ నిమ్మకాయ కేవలం రూ.4-5 వేలకు మాత్రమే అమ్ముడవుతుందని భావించామని, అయితే దాని ధర రూ.లక్షకు చేరుకుందని వేలం నిర్వాహకుడు డేవిడ్ బ్రెట్టెల్ చెప్పారు. పెట్టె రూ.3 వేలకే విక్రయించారు. అయితే, ఇలాంటి నిమ్మకాయ మళ్లీ దోరకడం కష్టమని ఇంత ధర పలికిందని ఆయన అంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook