'సమయపాలన' అనేది చాలా ముఖ్యం. అది ఉద్యోగమైనా లేదా జీవితమైనా..! ప్రవేట్ ఆఫీసుల్లో అయితే పనిదినాలను దృష్టిలో పెట్టుకొని ఆలస్యంగా వచ్చినా ఆ టైంకి పనులు చేసుకొని వెళ్తారు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం అలా కాదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో లేట్ గా ఉద్యోగానికి వెళ్తే అడిగేవారు ఎవరూ ఉండరు. ఇక ఉద్యోగులే ఇలా ఉంటే.. రాజకీయ నాయకుల పరిస్థితి? ప్రజాప్రతినిధులుగా గెలిచాక ఒక్కచోటే.. అది కూడా శాశనసభ, పార్లమెంట్ సమావేశాలుకు హాజరుకావాలి. మనవాళ్లు ఆ సమావేశాలకూ లేట్ గా వెళుతుంటారు. కానీ ఒక ప్రజాప్రతినిధి సమావేశాలకు లేట్ గా వచ్చానని ఎంపీ పదవికే రాజీనామా చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్లమెంట్ కు ఆలస్యంగా వచ్చాననే కారణంతో మైకేల్ వాల్టన్ బేట్స్ ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా బ్రిటన్ కేబినేట్ లో కీలకంగా వ్యవహరించే ఇతడు తనకు తాను వేసుకున్న ఈ శిక్షను ప్రధాని థెరీసా మే సహా ప్రతిపక్ష పార్టీలు తోసిపుచ్చాయి. ఆయనపై నమ్మకం ఉందని, మరోసారి ఇలా కాకుండా చూసుకుంటే సరిపోతుందని.. అంతమాత్రాన రాజీనామాకు సిద్దపడటం సరైంది కాదని అక్కడున్నవారందరూ బుజ్జగించారు.


మన దగ్గర ఉన్నారు ఎందుకు? ఇలా చేయాలంటే ఎంతమంది ఎంపీలు ఎగిరిపోతారో? ఆలస్యం మాట దేవుడెరుగు.. సభకు రానివారెందరో!!