Philippines Crash: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం, విమానం కూలిన ఘటనలో 17 మంది మృతి
Philippines Crash: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మిలిటరీ విమానం కూలిన ఘటనలో పెద్దఎత్తున మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 17 మంది మృతదేహాల్ని వెలికితీశారు.
Philippines Crash: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మిలిటరీ విమానం కూలిన ఘటనలో పెద్దఎత్తున మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 17 మంది మృతదేహాల్ని వెలికితీశారు.
ఫిలిప్పీన్స్ (Philippines)దేశంలో ఘోరం జరిగింది. దేశ వైమానిక రంగానికి చెందిన సీ 130 విమానం (C 130 Plance Crash) కూలిపోయింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 17 మృతదేహాల్ని వెలికి తీశారు. 40 మందిని రక్షించినట్టు ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన తెలిపారు. ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది సిబ్బందిని మరో ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో విమానం ల్యాండింగ్ సమయంలో నేలకూలిందని..ఆ సమయంలో మంటలు చెలరేగాయని సమాచారం. ఇప్పటికి 40మందిని రక్షించగా..మిగిలినవారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలకు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో జరిగిన ఈ ప్రమాద ఘటన ప్రమాదమా లేక ఉగ్రదాడినా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. గత నెలలో కూడా ఓ బ్లాక్ హ్యాక్ ఛాపర్ కూలి ఆరుగురు మరణించారు.
Also read: Delta Variant: ప్రమాదకరంగా మారుతున్న డెల్టా వేరియంట్, WHO ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook