Australia: ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాల మధ్య విమానం విన్యాసాలు చూస్తే..ముందుగా గుర్తొచ్చేది ట్విన్ టవర్స్‌పై దాడి ఘటనే. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఘటన అదే గుర్తు చేసింది. కాస్సేపు ఆందోళనకు లోనైనా..తరువాత తేరుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ (Brisbane)నగరంలో జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. నగరంలోని ఎత్తైన భవనాల మధ్యలోంచి అతి పెద్ద యుద్ధవిమానమొకటి రయ్ మంటూ దూసుకుపోవడమే కాకుండా..కాస్సేపు మెలికలు తిరుగుతూ విన్యాసాలు చేసింది. ఈ దృశ్యం చూసి అక్కడి ప్రజలు కాస్సేపు ఆందోళన చెందారు. కళ్లముందు అమెరికా ట్విన్ టవర్స్ ఘటన గుర్తొచ్చింది. కొంతమంది నెటిజన్లు ఆ కామెంట్లే చేశారు. 


అయితే ఇది ఆస్ట్రేలియాకు చెందిన సీ 17 కార్గో యుద్ధ విమానమని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే ఏదో మూల కలవరం. జరగరానిదేమైనా జరిగితే ఏంటి పరిస్థితనే కలకలం రేగింది. సుశిక్షితులైన పైలట్లు నడిపిన ఈ విమానం సాదా సీదా కాదు. ఆస్ట్రేలియా రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సీ 17 కార్గో విమానం(C17 Aircraft). రివర్ ఫ్రంట్ ఉత్సవాలకు ముందస్తుగా చేసే రిహార్సల్‌లో భాగంగా ఆ విమానం ఇలా విన్యాసాలు చేసింది. కొంతమంది ఇది చూసి భయపడినా..మరి కొంతమంది మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఆకాశ హర్మ్యాల మధ్య నుంచి విన్యాసాలు కావడంతో అత్యంత సాహసోపేతమైందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



 


Also read: UNSC India: భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook