Canada Lifts Ban: కరోనా మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా ట్రావెల్ ఆంక్షలు తొలుగుతున్నాయి. అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమవుతున్నాయి. తాజాగా కెనడా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ట్రావెల్ ఆంక్షలు కొనసాగాయి. ఇంచుమించు అన్నిదేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని విధించాయి. ఇప్పుడు కరోనా సంక్రమణ తగ్గుముఖం పట్టడంతో తిరిగి రాకపోకల్ని పునరుద్ధరిస్తున్నారు. ట్రావెల్ ఆంక్షల్ని సరళీకరుస్తున్నారు. నిషేధాన్ని ఎత్తివేస్తున్నారు. ఇప్పుడు ఇండియా నుంచి దాదాపుగా విదేశాలకు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి.


ఈ నేపధ్యంలో తాజాగా కెనడా ప్రభుత్వం భారత విమానాలపై ఉన్న నిషేధాన్ని(Canada lifts Ban on indian flights)తొలగించింది. ఏప్రిల్ నెలలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు కెనడా భారత విమానాలపై నిషేధాన్ని విధించింది. ఇప్పుడు అంటే సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇండియా నుంచి నేరుగా విమానాల రాకపోకలకు అనుమతిచ్చింది. అయితే ప్రయాణానికి 18 గంటల ముందుగా ప్రయాణీకులు ఢిల్లీ విమానాశ్రయంలోని అధీకృత ల్యాబ్ నుంచి చేయించుకున్న కోవిడ్ 19 నెగెటివ్ రిపోర్ట్(Covid19 Test Negative Report) సమర్పించాల్సి ఉంటుంది. కెనడా ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి భారత హై కమీషనర్ అజయ్ బిసారియా హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఢిల్లీ-టోరంటో మధ్య డైలీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇతర దేశం మీదుగా కెనడా వెళ్లే భారత ప్రయాణీకులు మాత్రం మూడవ దేశంలో తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. 


Also read: Bharat Bandh: ఇవాళ భారత్ బంద్, సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook