Bharat Bandh: ఇవాళ భారత్ బంద్, సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 27, 2021, 07:48 AM IST
  • భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • ఆర్టీసీ బస్సులు మద్యాహ్నం వరకూ నిలిపివేత, స్కూల్స్‌కు సెలవు ప్రకటించిన విద్యాశాఖ
  • నూతన రైతు చట్టాలు, లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ భారత్ బంద్
Bharat Bandh: ఇవాళ భారత్ బంద్, సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 

కేంద్ర ప్రభుత్వం(Central government) ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల్ని(New Farm Laws)రద్దు చేయాలని కోరుతూ దాదాపు ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతుల ఆందోళన(Farmers Protest) కొనసాగుతోంది. నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కోట్లాది కార్మికుల ప్రయోజనాల్ని కాలరాసే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. దేశవ్యాప్తంగా 5 వందలకు పైగా రైతు సంఘాలు ఈ బంద్ తలపెట్టాయి.ఇప్పటికే భారత్ బంద్‌కు ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌కు సహకరిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. బంద్‌కు మద్దతుగా రాష్ట్రంలో మద్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సుల్ని(RTC Buses) ప్రభుత్వమే నిలిపివేసింది. విద్యా, వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛంధంగా బంద్ పాటిస్తున్నాయి. సినిమా హాల్స్‌లో ఉదయం ఆట రద్దైంది. బంద్‌కు మద్దతుగా రాష్ట్రంలో స్కూల్స్‌కు సెలవు ప్రకటించింది రాష్ట్ర విద్యాశాఖ. 

రవాణా పరంగా లారీ, ఆటో యూనియన్‌లు మద్దతు తెలిపాయి. రవాణా పూర్తిగా స్థంబించనుంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. బంద్‌కు ప్రజలు సహకరించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో జరిగే బంద్‌తో కనువిప్పు కలగాలంటున్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను(Visakha steel plant) ప్రైవేట్‌పరం చేయవద్దని కార్మిక సంఘాలు నినదిస్తున్నాయి. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్ బంద్ (Bharat Bandh) కారణంగా సివిల్స్ పరీక్షల కోచింగ్ ఎంపిక పరీక్షను ఏపీ స్డడీ సర్కిల్ వాయిదా వేసింది. అటుఏపీపీజీఈసెట్ పరీక్ష కూడా వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన ఇతరత్రా పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి.

Also read: Cyclone Gulab live updates: కళింగపట్నం సమీపంలో తీరం దాటిన గులాబ్ తుపాను

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News