కెనడా ఎక్స్ ప్రెస్ విమానానికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో వెలుగు చూసింది. విమానం గాలిలోకి ఎగురుతున్న సమయంలో ఓ  చక్రం ఊడి కింద పడిపోయింది.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎయిర్ కెనడా ఎక్స్ ప్రెస్ విమానం అప్పుడే .. మాంట్రెయిల్-ట్రుడో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్ అందుకున్న సమయంలో ఎడమ వైపున ఉన్న  చక్రంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది ఊడి కింద పడిపోయింది. ఈ దృశ్యాన్ని విమానంలో కూర్చున్న ప్రయాణికుడు ఒకరు సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. అతడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఘటన జరిగిన విమానంలో అప్పుడు 49 మంది ప్రయాణికులు  ఉన్నారు.



సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్లు ఈ విషయాన్ని వెంటనే విమానాశ్రయ అధికారులకు తెలిపారు. దీంతో చాలా జాగ్రత్తగా తిరిగి విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఐతే ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామంటూ విమాన ప్రయాణీకులు చెప్పారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..