Canada PM Divorce: విడిపోతున్నట్లు ప్రకటించిన కెనడా ప్రధాని దంపతులు..
Canada PM Divorce: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో వీరు తమ 18 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికినట్లయింది.
Canada PM Divorce: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canadian PM Justin Trudeau), ఆయన భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో(Sophie) తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించారు. పలుమార్లు అర్థవంతంగా చర్చించుకున్న తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చట్టబద్దంగా విడిపోయే ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేసినట్లు కెనడా ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయిర్ 2005లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 15, 14 మరియు 9 సంవత్సరాల గల ముగ్గురు పిల్లలు ఉన్నారు. 18 ఏళ్ల వివాహ బంధానికి తాజాగా ఈ జంట స్వస్తి పలికింది. అయితే పిల్లల సంరక్షణ బాధ్యత ఇద్దరూ కలిసే చూసుకుంటామని ట్రూడో దంపతులు ప్రకటించారు. ఇప్పటికే ఒట్టావాలోని వేరే ఇంట్లోకి వెళ్లిపోయారు సోఫీ. తన సంతానాన్ని చూసుకునేందుకు రిడియా కాటేజీకి వస్తుంటానని.. అధికారిక పర్యటనల నిమిత్తం ప్రధాని వెళ్లినప్పుడూ వారి బాధ్యత తానే వహిస్తానని సోఫీ ట్రుడో చెప్పారు. టీవీ యాంకర్ గా, మోడల్ గా సోఫీ గ్రెగోయిర్ సుపరిచితురాలు.
2020లో ట్రుడో దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోఫీని ఉద్దేశిస్తూ.."నా రాక్, నా భాగస్వామి మరియు నా బెస్ట్ ఫ్రెండ్" అంటూ ట్రుడో అభివర్ణించాడు. ప్రధాని పదవిలో ఉండగా భార్యకు విడాకులు ప్రకటించిన రెండో ప్రధానిగా జస్టిన్ ట్రుడో నిలిచారు. మెుదటి వ్యక్తి ఆయన తండ్రి పియరీ ట్రూడో కావడం విశేషం. 1977లో పియరీ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన భార్య మార్గరెట్ నుండి విడిపోయారు.
Also Read: China Floods: చైనాను ముంచెత్తిన వరద.. 20 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి