China Floods: చైనాను ముంచెత్తిన వరద.. 20 మంది మృతి

రెండో అగ్రదేశంగా కొనసాగుతున్న చైనా ఇపుడు చిగురుటాకులా వణికిపోతోంది. దేశమంతటా భారీ వర్షాలు పడటంతో పెద్ద నగరాలన్నీ నీట మునిగాయి. లెక్కల ప్రకారం చైనాలో వరదల కారణంగా 20 మంది మరణించగా..  30 మంది గల్లంతయ్యారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2023, 04:45 PM IST
China Floods: చైనాను ముంచెత్తిన వరద.. 20 మంది మృతి

Floods in China: ప్రపంచ దేశాలను వణించే సత్తా తనకు ఉంది అంటూ ప్రగల్బాలు పలికే చైనా ఇప్పుడు చిగురుటాకు మాదిరిగా వణికి పోతుంది. దేశం మొత్తం కూడా విపరీతమైన వర్షాలు పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరదలతో ముఖ్య నగరాలు ఇంకా పట్టణాలు మునిగి పోయాయి. దేశంలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 20 మంది చనిపోయారు.. మరో 30 మంది గల్లంతు అయ్యారు. 

మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటూ చైనా అధికారిక మీడియా సంస్థ ఒక కథనంలో పేర్కొనడం జరిగింది. అయితే చైనా  అధికారిక మీడియాలో వచ్చే కథనాలను నమ్మడానికి లేదు అంటూ ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు మీడియాలో చెబుతున్న దాని కంటే కూడా ఎక్కువగా మృతుల సంఖ్య ఉండే అవకాశం ఉందని టాక్‌.

పదుల కొద్ది రైల్వే స్టేషన్ లను మూసి వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ ల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరడంతో రన్‌ వే లను మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. పలు విమానాలు రద్దు కాగా... కొన్ని విమానాలను ఆలస్యంగా నడిపిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. 

పదుల కొద్ది రైల్వే స్టేషన్‌ ల్లో జనాలు చిక్కుకోవడంతో వారిని కాపాడి సమీపంలో ఉన్న పాఠశాలలకు తరలించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలకు చైనా ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. అత్యంత పెద్ద విపత్తు అయిన సమయంలో మాత్రమే చైనా ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు ఆర్మీ రంగంలోకి దిగింది అంటే పరిస్థితి అక్కడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Also Read: Diamond Come To Earth Siege: వజ్రాలు ఎలా భూమిపైకి వచ్చాయో తెలుసా? వాటికి ఉండే పవర్‌ తెలిస్తే షాక్‌ అవుతారు!  

బీజింగ్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురవడంతో దాదాపుగా రెండు రోజుల పాటు జనాలు ఇంట్లోంచి బయటకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. రాజధాని బీజింగ్ రోడ్లు అన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో చైనా అధికారిక గ్లోబల్‌ టైమ్స్ మీడియా సంస్థ 20 మంది చనిపోయారు అంటూ కథనాలను రాస్తూ ఉండటం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

చైనాలో ఇప్పటికే వందల మంది వరదల కారణంగా చనిపోయి ఉంటారు అనేది అక్కడి వారి మాట. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనాలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కనీసం నెల రోజులు అయినా సమయం పడుతుంది అంటూ స్థానికులు అధికారులు చెబుతున్నారు.

Also Read: Nitin Desai death: లగాన్, జోధా అక్బర్ చిత్రాల ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ కన్నుమూత  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News