Corona Cases: భారత్‌కు ప్రయాణాలు చేయవద్దని పౌరులను హెచ్చరించిన అమెరికా ప్రభుత్వం
CDC Warns Americans To Avoid Travelling to India | భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పర్యటించకూడదని తమ పౌరులను అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(CDC) ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్ పర్యటన అంటే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా సెకండ్ వేవ్‌లో భారీగా నమోదవుతున్న కోవిడ్19 కేసులు, మరణాలు అందుకు కారణమని చెప్పవచ్చు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పర్యటించకూడదని తమ పౌరులను అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(CDC) ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్‌లో నిన్న 2.73 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా మహమ్మారి బారిన పడి 1,619 మంది మరణించారు. మరోవైపు దేశంలో వ్యాక్సిన్ల కొరత అని, విదేశీ వ్యాక్సిన్ల వైపు మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరగగానే, అగ్రరాజ్యాలు, కీలక దేశాలు భారత్ పర్యటన అంటే వెనుకంజ వేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం సైతం తన పౌరులను భారత్‌లో కొంతకాలం పర్యటించకూడదని సూచించింది. కరోనా టీకాలు తీసుకున్న వారికి సైతం కరోనా బారిన పడే ప్రమాదం పొంచి ఉందని సీడీసీ భావిస్తోంది.
కనుక భారత్ పర్యటనను రద్దు చేసుకోండి, లేదా కొంతకాలం వరకు భారత్ పర్యటనకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఒకవేళ కచ్చితంగా భారత్‌కు వెళ్లాల్సి వస్తే పూర్తిస్థాయిలో టీకాలు తీసుకుని ప్రయాణాలు చేయాలని ఆ ప్రకటనలో అమెరికా పౌరులకు సీడీసీ సూచించింది.
న్యూజిలాండ్ ప్రభుత్వం సైతం భారత్ నుంచి ప్రయాణికులకు కొంతకాలం పాటు నిషేధించడం తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ ప్రయాణికులు ఎవరైనా భారత్ నుంచి స్వదేశానికి వచ్చారంటే వారిని సైతం అనుమతించకూడదని కఠిన ఆంక్షలు విధించారు. భారత్ నుంచి ప్రయాణాలపై బ్రిటన్ ప్రభుత్వం సైతం ఆంక్షలు విధించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపత్యంలో భారత్‌ను రెడ్ లిస్ట్‌లో పెట్టినట్లు ప్రకటించారు.
Also Read: దేశం మొత్తం Lockdown విధిస్తారా ? స్పందించిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook