దేశం మొత్తం Lockdown విధిస్తారా ? స్పందించిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman

Lockdown 2021 news updates: ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ (Lockdown in Delhi) విధించడం, దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు దేశ పౌరులను వేధిస్తున్నాయి.

  • Apr 19, 2021, 22:36 PM IST

ఈ నేపథ్యంలోనే దేశంలో లాక్‌డౌన్ (Lockdown in India) విధించే అవకాశాలు ఉన్నాయా అనే సందేహాలు, వదంతులకు చెక్ పెడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) ఓ కీలక ప్రకటన చేశారు.

1 /5

ప్రస్తుత పరిస్థితులకు తోడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే (Nationwide lockdown) అవకాశాలు లేకపోలేదంటూ సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఎవరి అభిప్రాయం వాళ్లు వెల్లడిస్తుండటం సాధారణ పౌరులను ఇంకొంత అయోమయానికి గురిచేస్తోంది.

2 /5

ఈ నేపథ్యంలోనే దేశంలో లాక్‌డౌన్ (Lockdown in India) విధించే అవకాశాలు ఉన్నాయా అనే సందేహాలు, వదంతులకు చెక్ పెడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) ఓ కీలక ప్రకటన చేశారు.

3 /5

కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) విధించే ఆలోచనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన ద్వారా స్పష్టంచేశారు.

4 /5

అయితే, కరోనావైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు చిన్న చిన్న మైక్రో కంటైన్మెంట్ జోన్లు (small containment zones) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

5 /5

ఎక్కడెక్కడైతే కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases in India) వెలుగుచూస్తున్నాయో, అక్కడక్కడ ఈ మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడి పౌరుల కదలికలను కట్టిడి చేయడం ద్వారా కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించవచ్చనేది కేంద్రం ఆలోచన.