All party meeting on Afghanistan crisis: కాబూల్: అఫ్గానిస్థాన్ సంక్షోభంపై, ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు ఈ నెల 26న అఖిలపక్షం భేటీ జరగనుంది. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ని ఆక్రమించినప్పటి నుంచి ఆ దేశంలో జరుగుతున్న అరాచకాలు, అక్కడి ప్రజలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్న తీరు, అఫ్గానిస్థాన్‌ సైనికులకు, తాలిబన్లకు మధ్య యుద్ధాన్ని తలపించిన ఊహించని పరిణామాలు, అఫ్గానిస్థాన్‌ పట్ల ప్రపంచ దేశాలు వ్యవహరిస్తున్న తీరు, భారత్ అవలంభించాల్సిన వైఖరి వంటి అంశాలు ఈ అఖిలపక్షం భేటీలో (All party meeting) చర్చకు రానున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా అఫ్గనిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను అక్కడి నుంచి భారత్‌కి తీసుకొచ్చే క్రమంలో తీసుకుంటున్న చర్యలు సైతం ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్లమెంటులో వివిధ పార్టీల పక్ష నేతలను ఈ అఖిలపక్ష భేటీకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదివారమే ఆదేశాలు అందాయి. ఇదే అంశంపై తాజాగా కేంద్ర మంత్రి జైశంకర్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ''ఈ అఖిలపక్షం భేటీపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మరిన్ని వివరాలు వెల్లడిస్తారు'' అని ట్వీట్ చేశారు.  



Also read : Panjshir Army: తాలిబన్లకు ఆ లోయలో ఎదురు దెబ్బ, 3 వందలమంది తాలిబన్లు హతం


ఆగస్టు 15న తాలిబన్లు (Talibans) అఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌ని వశం చేసుకోగా.. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే భారత ప్రభుత్వం దాదాపు 200 మంది భారతీయులను అక్కడి నుంచి ఖాళీ చేయించి భారత్‌కి తీసుకొచ్చింది. అందులో అఫ్గనిస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న భారత రాయబార కార్యాలయం (Indian embassy in Afghanistan) సిబ్బంది కూడా ఉన్నారు.


Also read : Kabul Stampede: కాబూల్ విమానాశ్రయంలో తొక్కిసలాట, ఏడుగురి మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook