Chandrayaan 3: మేం సిగ్గుతో తలదించుకుంటున్నాం, పాకిస్తాన్ నటి సంచలన ట్వీట్
Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ప్రపంచమంతా ఇండియాపై ప్రశంసలు కురిపిస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు. దేశ విదేశాల ప్రముఖులు, సెలెబ్రిటీలు శాస్త్రవేత్తల కృషిని శ్లాఘిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
Chandrayaan 3: అదే సమయంలో ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు కూడా ఇండియాను ప్రశంసిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ సహచరుడు, మాజీ మంత్రి ఫహద్ అయితే చంద్రయాన్ 3 ప్రత్యక్ష ప్రసారాన్ని తమ దేశంలో చేయాలని సూచించారు. ఇప్పుడు పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతూ ప్రపంచమంతా ప్రశంసలు కురిపిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశంగా ఇండియా ఖ్యాతిని అంతా కీర్తిస్తున్నారు. పాకిస్తాన్ నటి సెహర్ షిన్వాలీ చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందిస్తూ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా సొంత దేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇండియాతో శత్రుత్వాన్ని పక్కనబెడితే ఇస్రోని అభినందించాల్సిందేనని ట్వీట్ చేసింది. భారత ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఇది సాధ్యమైందన్నారు. భారత్ స్థాయిని అందుకోవడం పాకిస్తాన్ కు ఇప్పట్లో సాద్యం కాదని. భారత్ ఎంత ఎత్తుకు ఎదిగిందో చూసి పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకోవాలని ట్వీట్ చేసింది. ఈ దురదృష్టకర పరిస్థితితి పాకిస్తాన్ స్వయంకృతాపరాధమే కారణమని ఆమె వెల్లడించింది.
ఈమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌పై వ్యంగ్యంగా వివిథ రకాల మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ జెండాలో చంద్రుడు ఉన్నాడు కానీ ఇండియా అయితే ఆ చంద్రుడిపైనే జెండా ఎగురవేసిందని చెప్పే మీమ్ బాగా వైరల్ అవుతోంది.
Also read: Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయవంతం, విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ఫోటోలు మీ కోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook