తూర్పు లఢాఖ్‌లోని గాల్వన్ లోయ(Galwan Valley)లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన(Indian Army Martyred) విషయం తెలిసిందే. అయితే చైనా మాత్రం తమ జవాన్ల మరణాలపై ఆచితూచి వ్యవహరించింది. ప్రపంచ వ్యాప్తంగా చైనా చర్యకు వ్యతిరేక పవనాలు వీచడంతో ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఎట్టకేలకు స్పందించింది. ఇరవై కంటే తక్కువ సంఖ్యలో చైనా ఆర్మీ జవాన్లు(China Army) చనిపోయారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 మంది కన్నా తక్కువ సంఖ్యలోనే గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో తమ జవాన్లు మరణించినట్లు చైనా అంగీకరించడం గమనార్హం. కమ్యూనిస్ట్ పార్టీ(China Communist Party) అనుకూల మీడియా ద గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. చనిపోయిన జవాన్ల సంఖ్య బహిర్గతం చేస్తే పరిస్థితి చేజారే అవకాశం ఉందని ప్రభుత్వం భావించినట్లు తెలిపింది. ఒకవేళ భారత జవాన్ల కన్నా తక్కువ సంఖ్యలో చైనా జవాన్లు చనిపోయారని ప్రకటిస్తే పొరుగు దేశంతో మళ్లీ అగ్గి రాజేసుకున్నట్లు ఉంటుందని భావిస్తున్నారట. కరోనా వచ్చినా పర్లేదు.. మందు దొరికితే చాలు!


గాల్వన్ లోయ ఘర్షణలో కనీసం 40 మంది చైనా జవాన్లు మరణించి ఉంటారని భారత ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే చైనా విశ్లేషకులు భారత్‌ను హెచ్చరిస్తున్నారు. చైనాకు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తే 1962 కంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని భారత్‌ లక్ష్యంగా ప్రకటనలు చేస్తున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ