China Flight Crash: చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 133 మంది మరణించినట్టు సమాచారం. విమాన ప్రమాదం కారణంగా అడవుల్లో మంటలు చెలరేగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గువాన్‌ఝూ నుంచి కున్మింగ్‌కు వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 133 మంది ప్రయాణీకులు మరణించినట్టు సమాచారం. గువాన్‌ఝూ నుంచి బయలుదేరిన కాస్సేపటికే ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానం MU5736 పర్వతాన్ని ఢీకొట్టి..కుప్పకూలినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో చెలరేగిన మంటలు అడవి అంతా అలముకున్నాయి. మధ్యాహ్నం 1 గంట 11 నిమిషాలకు బయలుదేరిన విమానం..3 గంటల 5 నిమిషాలకు కున్మింగ్‌కు చేరుకోవల్సి ఉంది. 


ప్రమాదం జరిగిన అడవిలో భారీగా మంటలు, పొగ అలముకోవడంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడింది. ఎందుకంటే విమానం క్రాష్ కావడం ద్వారా చెలరేగిన మంటలు ఆ అడవి అంతా విస్తరించాయి. ప్రమాదానికి గురైన బోయింగ్ 737 విమానం కేవలం ఆరేళ్ల క్రితం తయారైంది.



గతంలో 2018లో బోయింగ్ 737 మ్యాక్స్ ఆపరేట్ చేస్తున్న లయన్ ఎయిర్‌ఫ్లైట్ 610 ప్రమాదానికి గురైంది. ఆ తరువాత 2019లో అదే మ్యాక్స్ సంస్థకు చెందిన మరో బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. చైనాలో జరిగిన విమానం మాత్రం మ్యాక్స్ సంస్థది కాకపోవడం విశేషం.


Also read: China Plane Crash: బ్రేకింగ్ న్యూస్.. చైనా ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులు మృతి?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook