China Corona: ప్రపంచ దేశాలను  కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. దీంతో కీలక నగరాలన్నీ ఆంక్షల దిగ్బంధంలోకి వెళ్తున్నాయి. ఉత్తర కొరియాలో విలయ తాండవం చేస్తున్న వైరస్..తాజాగా పుట్టినిల్లు చైనాలోనూ వణికిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిన్‌పింగ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఆంక్షలను కఠిన తరం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీరో కరోనా పాలసీ ఆధారంగా బీజింగ్‌లో మరోసారి లాక్‌డౌన్‌ను తీసుకొచ్చారు. చైనాలో ఎన్ని ఆంక్షలు అమలు చేసినా ఏదో ఒక ప్రాంతంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. కీలక నగరాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. హయిడియన్, చావోయాంగ్,ఫెంతాయ్, షన్‌యి, ఫాంగ్‌షాన్‌ జిల్లాల్లో ఆంక్షల వలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. 


అత్యవసర సేవలు, ఆహారం డెలివరీలు చేసే రెస్టారెంట్లు, ఫార్మసీలు మినహా అన్ని మూత పడ్డాయి. థియేటర్లు, జిమ్‌లు, షాపింగ్‌ మాల్స్‌ను కట్టేశారు. పబ్లిక్ పార్కులను 30 శాతం సామర్థ్యంతో నడుపుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఇళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరు వరకు ఆంక్షలు మరింత కఠినంగా ఉండనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.


ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని అంటున్నారు. ఇటు ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి. సరైన విధానాలు లేకపోవడంతోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. చైనాలో 24 గంటల వ్యవధిలో 157 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో బీజింగ్ నుంచే 52 కేసులు ఉన్నాయి. 


Also read:Sekhar Movie: జీవితా రాజశేఖర్‌ దంపతులకు షాక్..సినిమా నిలిపివేయాలని కోర్టు ఆదేశం..!


Also read:Rishab Pant: ఇదేంది పంతూ... చేసిందంతా చేసి టీమ్ మేట్స్‌ను నిందిస్తావా... రిషబ్ పంత్‌పై నెటిజన్ల ట్రోలింగ్   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook