Maglev Train: అత్యధిక వేగంతో నడిచే రైలును చైనా విజయవంతంగా ప్రయోగించింది. వాస్తవానికి రెండేళ్ల క్రితమే గంటకు 600 కిలోమీటర్ల వేగాన్ని దాటి కొత్తగా 623 కిలోమీటర్ల వేగంతో రికార్డు బ్రేక్ చేసింది. అదే సరికొత్త మ్యాగ్లెవ్ రైలు. మాగ్నెటిక్ లెవిటేషన్ హై స్పీడ్ రైలు ఇది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గంటకు 623 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మ్యాగ్లెవ్ రైలును విజయవంతంగా ప్రయోగించినట్టు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ప్రకటించింది. 2 కిలోమీటర్ల పొడుగున్న లో ప్రెషర్ హైపర్ లూప్‌లో గంటకు 623 కిలోమీటర్ల వేగాన్ని దాటి మ్యాగ్లెవ్ రైలు ప్రయాణించినట్టు ఆ సంస్థ తెలిపింది. అల్ట్రా ఫాస్ట్ హైపర్ లూప్ రైలు అతి తక్కువ పీడనం కలిగిన ట్యూబ్‌లో ప్రయాణిస్తూ నిర్ధిష్టమైన వేగాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. అంటే త్వరలో విమానవేగంతో నడిచే రైలును చైనా తయారు చేయనుంది. 


మాగ్నెటిక్ లెవిటేషన్ రైలు పూర్తిగా విద్యుత్ అయస్కాంత టెక్నాలజీతో నడుస్తుంది. అధిక వేగం అందుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన గాలి నిరోధకతను తగ్గించే లో వాక్యూమ్ ట్యూబ్ సహకరిస్తుంది. ప్రస్తుతం గంటకు 623 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని కొత్త రికార్డు నెలకొల్పిన మ్యాగ్లెవ్ రైలు త్వరలో గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. 


మ్యాగ్లెవ్ రైలు అందుబాటులో వస్తే బీజింగ్-షాంఘై మధ్య ఉన్న వేయి కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దశలవారీగా సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతిని అందిపుచ్చుకుంటూ మ్యాగ్లెవ్ రైలు విజయవంతం అవుతుందని ఆశిస్తున్నారు. 


Also read: JEE Main 2024 Session 1 Results: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు విడుదల, అగ్రస్థానం తెలుగు రాష్ట్రాలకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook