China-Taiwan War Effect: మొన్న కరోనా సంక్షోభం..నిన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. మరి రేపు చైనా-తైవాన్ యుద్ధ పరిస్థితులు. ఇప్పటికే కుదేలైన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు పెను ముప్పు వాటిల్లే ప్రమాదం కన్పిస్తోంది. చైనా-తైవాన్ యుద్ధ పరిస్థితులు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించనున్నాయి, ఇండియాపై ప్రభావం ఎంతవరకూ ఉండనుందో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచం ఇప్పుడు మునుపటిలా లేదు. ప్రతి దేశానికి ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఆర్ధికంగా బలహీనమయ్యే పరిస్థితి. ఇది చాలదన్నట్టు గత రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మొత్తం ప్రభావితమైంది. ఆ తరువాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరోక్షంగా ప్రభావం చూపించింది. అన్నింటి నుంచి కోలుకుని..దారిలో పడుతుందనుకునే క్రమంలో ఏదో ఒక రూపంలో మరో సమస్య పొంచి ఉండనే ఉంటుంది. నిన్న జరిగిన శ్రీలంక ఆర్ధిక సంక్షోభం ఇంకా కళ్లముందే నిలిచింది. ఇప్పుడు చైనా-తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరో పెను ముప్పుకు సంకేతాలుగా నిలుస్తున్నాయి.


తైవాన్ దేశంపై ఏ క్షణమైనా చైనా యుద్ధానికి దిగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా మారనున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలా కొన్ని దేశాలకు పరిమితం కాకపోవచ్చంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే చైనా దాడి చేస్తే..అమెరికా, జపాన్ దేశాలు కచ్చితంగా తైవాన్‌కు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. యుద్ధంలో చైనా ఉపయోగించే క్షిపణుల కారణంగా మూడొంతుల జల రవాణాపై ప్రభావం పడనుందని తెలుస్తోంది. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలోని నౌకాయానంపై ప్రభావం పడుతుంది. 


ఇప్పటికే చైనాను కట్టడి చేసేందుకు అమెరికా పలు రకాలుగాా ప్రయత్నాలు చేస్తోంది. ఆర్ధిక ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. అమెరికా మిత్రదేశాలు తైవాన్ తరపున నిలిస్తే..ఇదొక మహా సంగ్రామంగా మారే ప్రమాదముంది. అదే జరిగితే యుద్ధం ఎంతకాలం జరుగుతుందనేది అంచనా వేయలేం. ఫలితంగా ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్ధిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడితే..ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఇంకా కుదేలౌతుంది. 


ఇండియాపై ప్రభావం ఎలా


ఇండియా-తైవాన్ దేశాల మధ్య అధికారిక దౌత్య సంబంధాల్లేకపోయినా..మైత్రి మాత్రం కొనసాగుతోంది. ప్రపంచంలో సెమీ కండక్టర్ల తయారీలో తైవాన్ వాటా ఏకంగా 30 శాతముంది. మనం ఉపయోగించే అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో వినియోగించే చిన్న, మధ్య శ్రేణి చిప్‌లు తయారయ్యేది తైవాన్ దేశంలోనే. యాపిల్, క్వాల్‌కామ్ వంటి కంపెనీలకు, అమెరికా యుద్ధావసరాలకు చిప్‌లు కూడా తైవాన్ నుంచే అందుతున్న పరిస్థితి. ఇండియాలో సెమీకండక్టర్ల పరిశ్రమకు తైవాన్ నుంచి తోడ్పాటు ఆశిస్తోంది. యుద్ధమే జరిగితే సెమీ కండక్టర్ల పరిశ్రమపై ఇండియా పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతాయి. చైనాపై ఆధారపడిన ఇండియాలోని కెమికల్, ఫార్మా కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. 


ప్రపంచదేశాలపై


అటు ప్రపంచంలోని ఆర్ధిక వ్యవస్థపై చైనా ప్రభావం ఇప్పటికే చాలా ఉంది. యుద్ధ పరిస్థితులు ఏర్పడితే చైనా నుంచి ఉత్పత్తులతో పాటు, వివిధ దేశాల్నించి చైనా చేసుకుంటున్న దిగుమతులు కూడా నిలిచిపోతాయి. ఫలితంగా చైనా నుంచి ఎగుమతి, దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్ధిక వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుంది. ఇక ఇండో పసిఫిక్ జల రవాణా నిలిచిపోతే..జపాన్ దేశపు ఎగుమతి, దిగుమతులు కూడా ఆగిపోతాయి. అమెరికా ఆంక్షలు అమలు చేస్తే..చైనా ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి..మొత్తం ప్రపంచానికే సమస్యగా మారుతుంది.


అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్దంలా కాకుండా..చైనా-తైవాన్ యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఏమౌతుందనే ఆందోళన వెంటాడుతోంది. చైనా ఇరుగుపొరుగు దేశాల ఆర్ధిక పరిస్థితులు ప్రబావితం కానున్నాయి. 


Also read: History Of Tiranga: అవును ఇవన్ని మన పతాకాలే.. వీటి చరిత్ర మీకు తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook