China vs America: చైనా, అమెరికా మధ్య వార్ నెలకొన్నట్లు కనిపిస్తోంది. తైవాన్‌పై ఇరు దేశాలు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల తైవాన్‌లో అమెరికా పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించారు. దీనిపై చైనా గుర్రుగా ఉంది. తైవాన్‌పై తిష్ట వేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో చైనా, అమెరికా మధ్య యుద్ధం జరగొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్లో మాట్లాడారు. ఈసందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు తెలుస్తోంది. మరోవైపు చైనా తన సైనికులను తైవాన్ సరిహద్దుల్లో మోహరించింది. విన్యాసాల పేరుతో భారీగా చేరుకుంటున్నారు. ఐతే చైనా సైనికులు మాత్రం కేవలం విన్యాసాల కోసమే వచ్చామంటున్నారు. ఇటు అమెరికాకు తైవాన్‌ దగ్గరవుతుందన్న వార్తల నేపథ్యంలో ఆ దేశంపై చైనా ఆంక్షలు విధించింది.


పలు తైవానీస్‌ కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు, దిగుమతి ఆంక్షలు విధించింది. తైవాన్ ఆహార సంస్థల నుంచి ఉత్పత్తుల దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సుమారు 700 ఫిషింగ్ ఓడలను బ్లాక్‌ లిస్టులో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటు తైవాన్‌లోని పరిస్థితులను అమెరికా పర్యవేక్షిస్తోంది. అమెరికా పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనపై ఆరా తీస్తోంది. అదే సమయంలో చైనా తీరును తప్పుపడుతోంది. 


ఈక్రమంలోనే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. నాన్సీ పెలోసీ పర్యటన తప్పుడు సందేశం ఇచ్చేలా ఉందని..ఇది చైనా విధానాలకు వ్యతిరేకమని అంటోంది. దీని వల్ల చైనా, అమెరికా మధ్య తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. దీనిపై అమెరికా వైట్ హౌస్ భద్రతా మండలి స్పందించింది. తాము ఏ పాలసీని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. ఇరుదేశాల ప్రకటనతో యుద్ధ వాతారణం కనిపిస్తోంది.


చైనా తీరుపై జపాన్‌ సైతం సీరియస్ అయ్యింది. తైవాన్ జల సంధిని ఉల్లంఘిస్తున్నారని జపాన్ ప్రభుత్వం మండిపడినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా అమెరికా పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన పలు దేశాల మధ్య చిచ్చు పెడుతోంది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్దం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈక్రమంలో మరో యుద్ధం మొదలుకానుందన్న ప్రచారం జరుగుతోంది.


Also read:Hyderabad Traffic: హైదరాబాద్‌లో రేపే పోలీస్ సెంటర్ ప్రారంభోత్సవం..ట్రాఫిక్‌ మళ్లింపులు ఎక్కడెక్కడో తెలుసా..!


Also read:AP 10th Supplementary Results: పది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook