`కరోనా` కథ పెద్దది..!!
`కరోనా వైరస్` ఎలా పుట్టింది..? వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా..? జంతువుల్లోనే జన్మించిందా..? అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందనే దానిపై ఇప్పటికీ తలెత్తుతున్న ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉన్నాయి. కానీ ఒక్క దానికి కూడా సమాధానం దొరకడం లేదు.
'కరోనా వైరస్' ఎలా పుట్టింది..? వుహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందా..? జంతువుల్లోనే జన్మించిందా..? అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందనే దానిపై ఇప్పటికీ తలెత్తుతున్న ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉన్నాయి. కానీ ఒక్క దానికి కూడా సమాధానం దొరకడం లేదు.
'కరోనా వైరస్' విస్తరించిన తర్వాత వుహాన్ ల్యాబ్ నుంచి శాస్త్రవేత్తలు మాయమయ్యారు. దీంతో అమెరికా సహా చాలా దేశాలు చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందనే వాదిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందనే విషయం మాత్రం క్లారిటీ రాలేదని చెబుతున్నాయి. ఐతే చైనా సహా ఇతర దేశాల్లో కరోనా విస్తరించిన తర్వాత వుహాన్ ల్యాబ్‌లో కీలక శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. దాదాపు 3 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమె నిన్న చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న CGTN టీవీలో ప్రత్యక్షమయ్యారు.
కరోనా వైరస్‌కు సంబంధించిన చాలా విషయాలు ఆమె పంచుకున్నారు. బ్యాట్ ఉమెన్‌గా ప్రసిద్ధి పొందిన షి జెంగ్లీ.. కరోనా వైరస్ వెనుక పెద్ద కథ ఉందన్నారు. ప్రస్తుతం చూస్తున్న వైరస్ కేవలం పేద్ద మంచుకొండలో చిన్న భాగం మాత్రమేనని చెప్పారు. చాలా జంతువుల్లో మనుషులకు హాని కలిగించే ఎన్నో రకాల వైరస్‌లు దాగి ఉన్నాయని బాంబు పేల్చారు.
కరోనా వైరస్ ల్యాబ్‌లోనే పుట్టిందనే వాదనలను ఆమె తోసిపుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సైన్సును రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అంటే ఓ రకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదనలకు ఆమె నేరుగా కౌంటర్ ఇచ్చారు. కరోనా వైరస్‌కు సంబంధించి తమ బృందం గతేడాది డిసెంబర్ 30నే అనేక కీలకాంశాలను కనుగొందని ఆమె వివరించారు. కరోనాకు సంబంధించిన జన్యు శ్రేణిని గుర్తించామని తెలిపారు. అందుకే దీనికి నావల్ కరోనావైరస్ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.
నావల్ కరోనా వైరస్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను జనవరి 12నే ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHOకు సమర్పించామని షి జెంగ్లీ తెలిపారు. జంతువుల్లో కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో గమనించేందుకు తమ బృందం పరిశోధనలు చేసిందని చెప్పుకొచ్చారు. ముందుగా ఎలుకలు, ఆ తర్వాత కోతులపై ప్రయోగాలు చేపట్టామని తెలిపారు. మనుషుల్లో కరోనా వైరస్ ఊహకందని న్యూమోనియా వ్యాప్తి చెందిస్తుందని ఈ పరిశోధనల ద్వారా బయటపడిందని చెప్పారు.
కాబట్టి చైనా సహా ఇతర దేశాలన్నీ ఇలాంటి వైరస్‌లపై పరిశోధనలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని షి జెంగ్లీ అభిప్రాయపడ్డారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..