XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారన్న వార్త అవాస్తవంలా కనిపిస్తోంది. ఇటీవల వస్తున్న వార్తలు పెను సంచలనంగా మారాయి. ఐతే ఆయన ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో ప్రత్యక్షమయ్యారు. షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సులో పాల్గొన్నారు. దీంతో జిన్‌పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారన్న ఊహాగానాలకు తెరపడింది. ఇవాళ ఆయన బీజింగ్‌లోని ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనెలలో మధ్య ఆసియా పర్యటనకు వెళ్లి వచ్చి తర్వాత ఆయన కనిపించలేదు. దీంతో జిన్‌పింగ్ గృహనిర్బంధంలో ఉన్నారని ప్రచారం జరిగింది. చైనా అధినేత బయటకు రావడంతో అదంతా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఐతే ఓ మీడియా కట్టకట్టుకుని తప్పుడు ప్రచారం చేసిందన్న వాదన వినిపిస్తోంది. జిన్ పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని..పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) అధిపతిగా తొలగించారని విస్తృత ప్రచారం జరిగింది.


వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ..సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఆయన వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కుట్రలు జరిగినట్లు తెలుస్తోంది. మధ్య ఆసియా పర్యటనలో ఉన్నప్పుడే కుట్ర జరిగిందని జిన్‌పింగ్ సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా జిన్‌పింగ్ ఉన్నారు. మావో జెడాంగ్ తర్వాత అంతటి పేరును గడించారు.


ఈక్రమంలోనే తన పవర్‌ను సుస్థిరం చేసుకోవాలని యోచిస్తున్నారు. జీవిత కాల అధ్యక్షుడిగా ఉండాలని భావిస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే నెలలో జరిగే సీపీసీ కీలక సమావేశంలో ఈమేరకు నిర్ణయం జరగనుంది. జిన్ పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 2 వేల 300 మంది ప్రతినిధులు ఎన్నికైనట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఇలా చేయడం ద్వారా మూడోసారి అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక సులువు కానుంది. ఈమేరకు సీపీసీ సమావేశంలో ఆమోదం లభించనుంది.


Also read:IND vs SA: రేపటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్..టీమిండియా జట్టు ఇదిగో..!


Also read:Shiv Sena: ఉద్ధవ్ ఠాక్రే నుంచి శివసేన చేయి జారిపోతోందా..సుప్రీం కోర్టు ఏమన్నాదంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి