24 గంటల్లో 4,785 పాజిటివ్ కేసులు
కరోనావైరస్ మహమ్మారి ఆ దేశం, ఈ దేశం అని కాకుండా అన్ని ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా ఎంత ప్రాణ నష్టాన్ని చవిచూస్తుందో తెలిసిందే. అమెరికా లాగే ఎంతో అభివృద్ధి చెందిన రష్యాలోనూ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. నిత్యం కొత్తగా వేల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతుండటం రష్యాను కలవరానికి గురిచేస్తున్నాయి.
మాస్కో: కరోనావైరస్ మహమ్మారి ఆ దేశం, ఈ దేశం అని కాకుండా అన్ని ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా ఎంత ప్రాణ నష్టాన్ని చవిచూస్తుందో తెలిసిందే. అమెరికా లాగే ఎంతో అభివృద్ధి చెందిన రష్యాలోనూ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. నిత్యం కొత్తగా వేల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతుండటం రష్యాను కలవరానికి గురిచేస్తున్నాయి. మార్చి నెలాఖరు వరకు కరోనా ప్రభావం అంతగా లేని రష్యాలో ఏప్రిల్‌లో మాత్రం కోవిడ్ కేసులలో ఏ రోజుకు ఆ రోజే కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రష్యాలో శనివారం ఒక్కరోజే ఏకంగా 4,785 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించారంటే.. అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. శనివారం నాటి సంఖ్యతో కలిపి రష్యాలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 36,792కి చేరింది.
Also read : Coronavirus updates: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
రష్యా రాజధాని మాస్కోలోనే అత్యధిక సంఖ్యలో జనం కరోనా బారిన పడ్డారు. 12.7 మిలియన్ జనాభా ఉన్న మాస్కోలో ఇప్పటివరకు 20,754 మందికి కరోనా సోకింది. రష్యాలో ఉన్న మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో ఇది సగం కంటే ఎక్కువ. ఇప్పటి వరకు మొత్తం 313 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నాటి గణాంకాలను పరిశీలిస్తే... ఆ ఒక్క రోజే 4,070 మందికి కరోనావైరస్ పాజిటివ్ రాగా, 41 మంది చనిపోయారు.
Also read : వాళ్ల ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడలేదు
అయితే, ఒక విధంగా ప్రాణనష్టాన్ని తగ్గించడంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొంత విజయం సాధించారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రష్యాలోనూ కరోనా సోకిన వారి సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ.. అమెరికా, ఇటలీ, చైనా లాంటి దేశాలతో పోల్చుకుంటే రష్యాలో సంభవించిన ప్రాణనష్టం తక్కువగా ఉండటమే అందుకు కారణం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..