Omicron Symptoms: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ఇప్పుడు అనేక ప్రపంచదేశాలకు పాకింది. అటు అమెరికా, యూకేలతో పాటు ఫ్రాన్స్ లోనూ కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. గతవారం రోజుల వ్యవధిలో యూకేలో ఏకంగా 2 లక్షల 30 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమౌదైనట్లు తేలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కరోనా వల్ల కలిగే లక్షణాలలో జలుబు, జ్వరం, ఊపిరి ఆందకపోవడం, అలసట వంటి లక్షణాలు ఉండేవి. కానీ, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన వారికి కొత్తగా మరో రెండు లక్షణాలు గమనించినట్లు తెలుస్తోంది. 


డైలీ స్టార్ వెబ్ సైట్ ప్రకారం.. ప్రతి రోజూ యూకేలో వేలాది మందికిపైగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ బ్రిటన్ దేశాన్ని గడగడలాడిస్తుంది. అయితే ఈ వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ శాతం ఎలాంటి లక్షణాలు కనిపించడం  లేదని తెలుస్తోంది. కానీ, కొంతమందిలో మాత్రం జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నోటి దుర్వాసన, రుచిని కోల్పవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు వెల్లడైంది. 


కొత్తగా మరో రెండు లక్షణాలు


ఒమిక్రాన్ సోకిన వారిలో కొంతమందికి కళ్లు ఎర్రబడడం.. క్రమంగా జుట్టు రాలడం ఎక్కువ అవ్వడం వంటి లక్షణాలు ఉండవచ్చు. యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ACE2) అనే ఎంజైమ్ ద్వారా కరోనా వైరస్ ప్రజల కణాలలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఒమిక్రాన్ వైరస్ కళ్ల నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుందని భయపడుతున్నారు.  


కళ్లకు సోకడం


కొంతమంది వైద్యుల నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ కళ్లలోకి ప్రవేశించిన తర్వాత.. రెటీనా, ఎపిథీలియల్ కణాలకు సోకుంతుంది. ఈ రెండు కణాలు కళ్లు, కనురెప్పల భాగాలను తెల్లగా మారతాయి. 


ఒమిక్రాన్ కారణంగా కళ్లు ఎర్రగా మారడం సహా వాపు, డీహైడ్రేషన్, నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్యులు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి లక్షణాలపై ప్రస్తుతం అధ్యయనాలు జరుగుతున్నాయి.  


Also Read: France Covid Alert: ఫ్రాన్స్‌లో ప్రమాదకరంగా కరోనా సంక్రమణ, రోజుకు 2 లక్షలకు పైగా కేసులు


Also Read: Florona disease: కరోనానే కలవరపెడుతుంటే.. కొత్తగా 'ఫ్లొరోనా' వ్యాధి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి