Florona disease: దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్ గడ గడలాడిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతోంది. ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ (Omicron variant) ప్రపంచాన్ని కలవరపెడుతోంది.
అయితే ప్రజలను ఇప్పటికే కరోనా భయపెడుతుంటే.. తాజాగా 'ఫ్లొరోనా' (First case of Florona disease) కేసు బయటపడింది. ఇజ్రాయెల్‌లో తొలి 'ఫ్లొరోనా' వ్యాధి కేసు నమోదైనట్లుట్లు వార్తా సంస్థ అరబ్ న్యూస్ తాజాగా ట్వీట్ చేసింది.
ఏమిటి ఈ ప్లొరోనా..
కొవిడ్ 19 డబుల్ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లూయెన్జాలను కలిపి 'ఫ్లొరోనా'గా పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. రాబిన్ మెడికల్ సెంటర్లో ప్రసవం కోసం చేరిన ఓ మహిళలో ఈ 'ప్లొరోనా' వ్యాధిని గుర్తించినట్లు అరబ్ న్యూస్ పేర్కొంది.
దేశంలో తొలి 'ఫ్లొరోనా' కేసు నమోదైన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి తీవ్ర ఎలా ఉంటుంది అనే విషయంపై పరిశోధనలు ప్రారంభించింది. మనుషులపై ఈ వ్యాధి ఎలాంటి ప్రభావితం చేస్తుందనే విషయంపై.. ఆరోగ్య నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారు.
డబుల్ బూస్టర్ డోసుకు అనుమతి..
అయితే కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులను నియంత్రించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది. అర్హులకు కరోనా టీకా నాలుగో డోసు వేసేందుకు కూడా అనుమతినచ్చింది. నాలుగో డోసుకు అనుమతినిచ్చిన తొలి దేశం ఇదే కావడం గమనార్హం.
Also read: Video: మాస్క్ ధరించలేదని.. బండ బూతులు తిడుతూ వృద్దుడిపై మహిళ దాడి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook